Sarpanch shot dead: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు ఓ సర్పంచ్‌ను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి 8.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
చనిపోయిన వ్యక్తిని అహ్మద్ మీర్గా పోలీసులు గుర్తించారు. దక్షణ కశ్మీర్‌లోని అదోరా ప్రాతంలో ఉన్న మీర్ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే మీర్‌ను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అహ్మద్ మీర్ స్వతంత్ర అభ్యర్ధిగా సర్పంచ్ పదవి చేపట్టినట్లు చెప్పారు.
ఘటనా స్థలిని చుట్టుముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదులు కోసం జల్లెడ పడుతున్నాయి.
ఇదీ చూడండి: