మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు తనకు ముద్దు పెట్టాడని ఆగ్రహించిన ఓ వధువు పెళ్లి రద్దు చేసుకునేందుకు సిద్ధపడింది. దీంతో ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. చివరకు ఆ పెళ్లికూతురు మాటే నెగ్గి.. పెళ్లి రద్దు అయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ సంభాల్‌లోని బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద బదాయూలోని బిల్సీకి చెందిన యువకుడికి బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నవంబర్ 26న వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు మంగళవారం వరుడు అతడి కుటుంబ సభ్యులతో పాటు వధువు గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లి ఆచారాల్లో భాగంగా వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో కోపాద్రిక్తురాలైన ఆ యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. అలా ఇరు వర్గాల మధ్య ఓ చిన్నపాటి గొడవ జరగగా విషయం పంచాయతీ వరకు వెళ్లింది. పంచాయతీలోనూ వధువు అదే మాట చెప్పడం వల్ల విషయం బజోయ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అయినా.. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు వధువు ఒప్పుకోలేదు.
ఇదీ చదవండి:
సోనూసూద్ పెద్ద మనసు.. ప్రముఖ సారంగి ప్లేయర్ వైద్యానికి హామీ
'ఏకాంతంగా ఉంటున్నా.. నాకు పెళ్లి చేయండి'.. మేజిస్ట్రేట్‌ను కోరిన మరుగుజ్జు