అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటికి వరకు రూ.3000కోట్ల విరాళాలు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయితే లెక్కింపు కొనసాగుతోందని.. ఈ మొత్తం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడంలో ప్రజలు చూపుతున్న చొరవను ప్రశంసించారు.
ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడాన్ని నిలిపివేశామని చెప్పారు రాయ్. ట్రస్ట్ ఖాతా ద్వారా విరాళాలు వస్తున్నాయని తెలిపారు. రామమందిర అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఆన్లైన్ పద్ధతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విరాళాలు అందించవచ్చని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'అయోధ్య గుడికి రూ.1,511కోట్ల విరాళాలు'