ETV Bharat / bharat

సైకిల్ యాత్రతో అఖిలేశ్​​ 'మిషన్ యూపీ'- టార్గెట్​ 400!

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 400 స్థానాల్లో గెలుస్తామని సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా భాజపా ప్రభుత్వం.. పాత ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ధరల పెరుగుదల, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన 'సైకిల్​ యాత్ర' చేపట్టారు.

sp chief, akhilesh yadav
ఎస్​పీ అధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్​
author img

By

Published : Aug 5, 2021, 6:54 PM IST

రానున్న ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ) అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ కార్యాచరణ ప్రారంభించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నేరాలు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా గురువారం ఆయన 'సైకిల్​ యాత్ర' నిర్వహించారు. ప్రముఖ సామాజిక నేత జ్ఞానేశ్వర్​ మిశ్రా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తాలుకా స్థాయిలో ఈ సైకిల్​ యాత్రలకు సమాజ్​వాదీ పార్టీ పిలుపునిచ్చింది. లఖ్​నవూలో ఈ యాత్ర ప్రారంభించేముందు తమ పార్టీ వచ్చే ఏడాది ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తుందని అఖిలేశ్​ ధీమా వ్యక్తం చేశారు.

"నేను మా పార్టీ 350 సీట్లు గెలుస్తుందని చెబుతూ వచ్చాను. కానీ, ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని బట్టి చూస్తే.. మేము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని చెప్పగలం. కరోనా రెండో దశలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. ఆక్సిజన్​, మందులు అందించకుండా వారు చనిపోవడానికి కారణమైంది."

-అఖిలేశ్​​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.. నేరాలను భాజపా ప్రోత్సహిస్తోందని అఖిలేశ్​ ఆరోపించారు. "2017 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను భాజపా ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పుడు 'మనీ ఫెస్టో'ను రూపొందిస్తోంది. ఎస్పీ హయాంలో చేపట్టిన పాత ప్రాజెక్టులకు పేరు మార్చడం తప్పిస్తే.. నాలుగేళ్లుగా భాజపా చేసిందేమీ లేదు" అని విమర్శించారు.

పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు, కస్టోడియల్​ మరణాలు, గంగానదిలో మృతదేహాలు తేలడం వంటి విషయాల్లో ఉత్తర్​ప్రదేశ్​ను భాజపా నంబర్​ 1 స్థానంలో నిలిపిందని అఖిలేశ్​ వ్యాఖ్యానించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​కు ల్యాప్​టాప్​ వాడటం కూడా రాదని ఎద్దేవా చేశారు.

వచ్చే ఏడాది ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓటర్లను ఆకట్టుకునేందుకే జ్ఞానేశ్వర్ మిశ్రా జయంతి రోజున అఖిలేశ్​ ఈ సైకిల్​ యాత్ర చేపట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్​లో రథయాత్ర కూడా నిర్వహించేందుకు ఎస్పీ ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది.

ఇదీ చూడండి: వేడెక్కిన రాజకీయం- చిన్న పార్టీలతోనే అసలు చిక్కులు

ఇదీ చూడండి: 'భాజపా వ్యాక్సిన్​ను తీసుకునే ప్రసక్తే లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.