ETV Bharat / bharat

ప్రత్యేకతలకు నిలయం- శబరిమల తపాలా కార్యాలయం - శబరిమల తపాలా కార్యాలయం

కేరళ అయ్యప్ప సన్నిధిలో ఉన్న తపాలా కార్యాలయం భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే తెరచి ఉండే ఈ పోస్ట్‌ ఆఫీస్‌, దేశంలో ఎక్కడా లేని సదుపాయాలను అందిస్తోంది. అయ్యప్ప చిత్రాలు, 18 బంగారపు మెట్లు ఉండే సీల్‌ కవర్‌తో పాటు భక్తులు బుక్‌చేసుకుంటే ప్రసాదాన్ని సైతం ఇంటికి చేరవేస్తోంది.

Sabarimala PO: A Post Office that opens for only 3 months in a year
ప్రత్యేకతలకు నిలయం -శబరిమల పోస్ట్​ ఆఫీస్​
author img

By

Published : Nov 28, 2020, 4:36 PM IST

ప్రత్యేకతలకు నిలయం -శబరిమల పోస్ట్​ ఆఫీస్​

కేరళ పతనమ్​తిట్ట పరిధిలోని శబరిమల తపాలా కార్యాలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అయ్యప్ప సన్నిధిలో ఉన్న ఈ పోస్ట్ ఆఫీస్​లో స్వంత పోస్టల్ సీల్, పిన్‌కోడ్ ఉన్నాయి. సీల్​పై అయ్యప్ప చిత్రాలు, 18 బంగారపు మెట్ల గుర్తులు ఉంటాయి. మండల దీక్షల సమయంలోనే అంటే సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఈ పోస్ట్ ఆఫీస్‌ సేవలు అందిస్తుంది. ఈ తపాలా కార్యాలయం 1963 నుంచి అందుబాటులో ఉంది. ఇతర పోస్ట్ ఆఫీస్‌లతో పోలిస్తే ఇక్కడ ఉండే పోస్టల్ సీల్‌ సైతం విభిన్నంగా ఉంటుంది. అయ్యప్ప చిత్రంతో కూడిన స్టాంప్‌లను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచారు.

అయ్యప్పకు ఆహ్వానం

అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఎంతో మంది భక్తులు ఈ పోస్ట్ ఆఫీస్‌ నుంచి తమ కుటుంబ సభ్యులకు పోస్టు కార్డులను పంపిస్తారు. వివాహ ఆహ్వానాలు, గృహప్రవేశ ఆహ్వానాలు ఇలా ఎన్నో శుభకార్యాల ఆహ్వాన పత్రికలను సైతం భక్తులు అయ్యప్పకు పంపిస్తారు.

దేశంలో ఎక్కడికైనా ప్రసాదం

ఈ ఏడాది కొవిడ్ నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి రాలేని భక్తుల కోసం శబరిమల తపాలా కార్యాలయం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. దేశంలోని ఏ పోస్ట్‌ ఆఫీస్‌ నుంచైనా నగదు పంపిస్తే ప్రసాదాన్ని పంపేలా ఏర్పాట్లు చేసింది. మండల దీక్షలు ముగిసిన అనంతరం పోస్ట్‌ ఆఫీస్‌ను మూసివేసేటప్పుడు మిగిలిన అయ్యప్ప చిత్రాలను భద్రంగా ఉంచుతారు.

ఇదీ చదవండి: శబరిమల అయ్యప్ప గుడిలో కరోనా కలవరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.