Russia Women Shaktipeeth Visit On Bike : ఆమె రష్యాలో ఉన్నత ఉద్యోగి. తల్లిదండ్రులు ఇద్దరు ప్రముఖ వైద్యులు. కోట్లలో ఆస్తి, కానీ వాటన్నింటిని వదిలి గడ్డ కట్టించే చలిలో బైక్‌పై ఆధ్యాత్మికత యాత్ర చేపట్టింది. యోగినిగా మారి 52 శక్తి పీఠాల సందర్శన కోసం బయలుదేరింది. ఆమె కథేంటో తెలుసుకుందాం.
రష్యాకు చెందిన అన్నపూర్ణ అక్కడి వార్త పత్రికలో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసేవారు. తల్లిదండ్రలు ఇద్దరూ వైద్యులు. తల్లి అమెరికాలో ఉండగా, తండ్రి మాస్కోలో జీవిస్తున్నారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న అన్నపూర్ణ 2016లో యోగినిగా మారిపోయారు. ఈక్రమంలోనే భారత్‌కు వచ్చిన ఆమె దేశంలోని 52 శక్తి పీఠాలను సందర్శించాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం హరియాణాకు చెందిన మరో యోగి దీపక్ నాథ్‌తో కలిసి బైక్‌పై యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే 25 శక్తి పీఠాలను సందర్శించారు. ప్రస్తుతం గంగాసాగర్‌కు వెళ్తండగా ఆజాంగఢ్‌లో ఆగి సేదతీరారు. ఈక్రమంలోనే ఆమెను గమనించిన స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆమె యాత్రపై ప్రశ్నించగా, అంతా మహాదేవుడి ఆశీస్సులతోనేనని చెప్పుకొచ్చారు.
శక్తి పీఠాలు అంటే ఏమిటి?
పురాణ గాథలు, ఆచారాల పరంగా లయకారకుడైన పరమ శివుడి అర్ధాంగి పార్వతిదేవిని ఆరాధించే ఆలయాలు ఉన్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా చెబుతారు. అసలు శక్తి పీఠాలు ఎన్ని అంటే? మనదేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు 18 మాత్రమే. అయితే, 'ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ' అని లలితా సహస్రనామావళి 51శక్తి పీఠాలు ఉన్నట్లు తెలుపుతోంది. పురాణ గ్రంథాలను పరిశీలిస్తే, 108 శక్తి పీఠాలు ఉన్నట్లు చెబుతున్నాయి. కాళీ పురాణంలో 18 శక్తి పీఠాల గురించి చెబితే, దేవీ భాగవతంలో 66 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పారు. మరికొందరు 52 శక్తి పీఠాలు ఉన్నాయని చెబుతుంటారు.
అయితే, ఈ శక్తి పీఠాలను అర్థం చేసుకోవడానికి పురాణ ప్రాతిపదిక కొంత మేరకు ఉంటే, ఉపాసన పరమైన శాస్త్రం మరికొంత ఉపయోగపడుతుంది. మంత్రశాస్త్రంలోనూ, యోగశాస్త్రంలోనూ, ఈ శక్తి పీఠాల ప్రస్తావనం ఉంది. చైతన్యానికి ఆవాసం మానవ దేహం. 51 శక్తులు మన శరీరంలో అంతర్లీనమై ఈ దేహాన్ని నడిపిస్తున్నాయని చెబుతారు. కళ్లు, చెవులు, పాదాలు, చేతులు ఇలా ప్రతిది ఒక శక్తికి ప్రతీక, అవన్నీ కలిసిన దేహమే శక్తి రూపమని అంటుంటారు.
తొమ్మిదేళ్లకే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు
సన్యాసిగా మారనున్న యువ సైంటిస్ట్.. అమెరికాలో రూ.కోట్ల జీతం వదిలి ఆధ్యాత్మికం వైపు అడుగులు