ETV Bharat / bharat

'చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వరూ..'

చట్టసభల్లో అతివలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ మహిళా ఎంపీలు సోమవారం డిమాండ్​ చేశారు. దేశంలో 90 శాతం వనితలకు మహిళా దినోత్సవం గురించి అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

womens day, parliament
'పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్​ కల్పించాలి'
author img

By

Published : Mar 8, 2021, 6:55 PM IST

మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాజ్యసభలోని మహిళా సభ్యులు సోమవారం కీలక డిమాండ్​ చేశారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలన్నారు. అప్పుడే అతివలకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు.

"మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అదే విధానం పార్లమెంటు, అసెంబ్లీల్లో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి."

-ఛాయా వర్మ, కాంగ్రెస్​ ఎంపీ

"దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలు ఉన్నారు. కాబట్టి పార్లమెంటు, అసెంబ్లీల్లో రిజర్వేషన్లు 33 శాతం కాదు 50 శాతం ఉండాలి."

-ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ

"దేశంలోని 90 శాతం మహిళలకు ఈ రోజు ప్రత్యేకత తెలియదు. వారికి మహిళా దినోత్సవంపై ఎలాంటి అవగాహన లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం అమలు చేసే పథకాలు అన్నీ ఆ మహిళలకు అందుతాయని ఆశిస్తున్నాను."

-అమీ యజ్నిక్, కాంగ్రెస్​ ఎంపీ

"మహిళల సాధికారత కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. ముమ్మారు​ తలాక్​పై చట్టాన్ని తీసుకువచ్చింది. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం వల్ల దేశంలో లింగ నిష్పత్తి మెరుగు పడింది."

-సరోజ్​ పాండే, భాజపా ఎంపీ

"లోక్​ సభలో 78 మంది, రాజ్యసభలో 27 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో మెరుగైన అవకాశాలు వస్తున్నాయి."

-సంపాతియా ఉకీ, భాజపా ఎంపీ

సరోజ్ పాండే వ్యాఖ్యలను కాంగ్రెస్​ ఎంపీ ఫులో దేవీ నేతమ్ తిప్పికొట్టారు. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం అయితే ఉంది కానీ, మహిళలకు మాత్రం ఎక్కడా రక్షణ లేదని ఎద్దేశా చేశారు.

ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజల కోసం పని చేస్తున్న మహిళా ఎంపీల సేవలను కొనియాడారు. మహిళలకు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి : దీదీకి షాక్- భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.