ETV Bharat / bharat

మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కర్ణన్​కు కరోనా - Stanley Medical College about corona

మద్రాస్​ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కర్ణన్​.. కొవిడ్​ బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు.

Retired HC Justice Karnan tests Covid positive
మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కర్ణన్​కు కరోనా
author img

By

Published : Dec 9, 2020, 6:13 PM IST

Updated : Dec 9, 2020, 6:34 PM IST

మద్రాసు​ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కర్ణన్​​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని చెన్నై స్టాన్లీ మెడికల్​ కాలేజీ వైద్యులు తెలిపారు.

కొద్ది రోజులుగా చెన్నైలోని ఓ జైలులో ఉంటున్నారు జస్టిస్​ కర్ణన్. అనారోగ్యంగా ఉందని చెప్పగా జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

"అలసటతో ఆయన మంగళవారం మా ఆసుపత్రికి వచ్చారు. అప్పుడాయనకు సీటీ స్కాన్ చేస్తే ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష చేశాం. బుధవారం వచ్చిన ఆ ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం.. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. వారం క్రితం చేసిన కరోనా పరీక్షల్లో కర్ణన్​కు నెగెటివ్​గానే వచ్చింది."

-- పి.బాలాజీ, స్టాన్లీ మెడికల్​ కాలేజీ డీన్​

హైకోర్టు న్యాయమూర్తులు, వారి జీవితభాగస్వాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో జస్టిస్ కర్ణన్​ను​ చెన్నై పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:కరోనా కాదు.. ఐపీఎల్​పైనే మనోళ్ల ఆసక్తి

Last Updated : Dec 9, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.