ETV Bharat / bharat

కొవిడ్​ చికిత్స నుంచి రెమ్​డెసివిర్​ తొలగింపు! - కరోనా చికిత్స రెమ్​డెసివిర్​

కరోనా చికిత్స నుంచి రెమ్​డెసివిర్​ను తొలిగించే అవకాశాలు ఉన్నాయని గంగారామ్​ ఆసుపత్రి ఛైర్మన్​ డాక్టర్​ డీఎస్​ రాణా అన్నారు. రెమ్​డెసివిర్​ కరోనా బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే కారణమని తెలిపారు.

covid treatment remdesivir, కరోనా చికిత్స రెమ్​డెసివిర్​
రెమ్​డెసివిర్​
author img

By

Published : May 19, 2021, 10:12 AM IST

కరోనా చికిత్స నుంచి రెమ్​డెసివిర్​ను కూడా త్వరలోనే తొలగించే అవకాశం ఉందని దిల్లీలోని గంగారామ్​ ఆసుపత్రి ఛైర్​ పర్సన్​ డాక్టర్​ డీఎస్​ రాణా మంగళవారం వెల్లడించారు. కొవిడ్​ బాధితులపై ఈ ఔషధం ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెమ్​డెసివిర్​కు డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్​ రాణా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో ఏర్పడ్డ యాంటీబాడీలు రోగులపై ప్రభావం చూపిస్తాయని భావించాము. ఈ క్రమంలోనే ప్లాస్మా థెరపీ వచ్చింది. అయితే ఈ చికిత్స వల్ల రోగులు కోలుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల దానిని రద్దు చేశాము. అదే విధంగా కొవిడ్​ చికిత్సలో భాగంగా రోగులకు ఇస్తున్న రెమ్​డెసివిర్​.. వైరస్​పై ప్రభావం చూపిస్తున్నట్లు ఆధారాలు లేవు. అందుకే ఈ ఔషధాన్ని కూడా కొవిడ్​ చికిత్స నుంచి తొలగించాలని భావిస్తున్నాము."

-డాక్టర్​ డీఎస్​ రాణా, గంగా రామ్​ ఆసుపత్రి ఛైర్మన్​

ఇటీవల కొవిడ్​ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐసీఎంఆర్​ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇదీ చదవండి : యాంటీబాడీ టెస్టు ఏంటి? ఎందుకోసం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.