తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల డేటాని కొవిడ్-19 పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) కోరింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల డేటాను 24 గంటల్లోపు ఎన్సీపీసీఆర్కు చెందిన బాల స్వరాజ్ సంరక్షణ పోర్టల్లో నమోదు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, మహిళా, శిశు సంక్షేమ శాఖలకు ఎన్సీపీసీఆర్ లేఖ రాసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల డేటాను వెంటనే నమోదు చేయాలని లేఖలో కోరింది.
మార్చి 25 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా 577 మంది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా దెబ్బతో కార్మికులుగా మారుతున్న పిల్లలు