ETV Bharat / bharat

Drone Attack: జమ్మూలో డ్రోన్ల దాడి పాక్​ పనే! - drone attack on iaf

జమ్మూలో వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడిలో(Drone Attack) పాకిస్థాన్ పాత్ర తేటతెల్లమైంది. పేలుడు పదార్థాల్లో ఆర్​డీఎక్స్ వాడినట్లు ఫోరెన్సిక్ ప్రయోగాల్లో బయటపడింది. ఇది భారత్​లో లభించదు. మరోవైపు, ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్‌ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

kashmir drone attack
కశ్మీర్ డ్రోన్ దాడి
author img

By

Published : Jul 6, 2021, 3:27 PM IST

Updated : Jul 6, 2021, 4:05 PM IST

జమ్మూలోని వైమానిక స్థావరం వద్ద ఇటీవల డ్రోన్ల దాడి(Drone Attack) తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్​డీఎక్స్(Rdx), నైట్రేట్‌ ఉన్నట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్​డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్‌ నుంచి తెప్పించాల్సిందే. ఫలితంగా పేలుళ్లలో ఉపయోగించిన ఈ ఒక్క పదార్థమే.. పాక్‌ పాత్రను తెలియజేస్తోంది.

ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్‌ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి వాడిన రెండు బాంబుల్లో ఒకటి పెద్దదిగా ఉంది. దీనిని వైమానిక స్థావరాల్లో కట్టడాలను ధ్వంసం చేయడానికి సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. రెండో బాంబు.. మనుషులను లక్ష్యంగా చేసుకొని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే తొలి పేలుడు తర్వాత అక్కడకు చేరుకున్న వారు మరణించాలనే లక్ష్యంతో దానిలో ఎక్కువగా బాల్‌బేరింగ్‌ గుండ్లు, మేకులు వంటివి ఉంచారు. ఈ ఆధారాలన్నీ లష్కరే తోయిబా పాత్రను తెలియజేస్తున్నాయి. పాక్‌ సైన్యంలో అప్రకటిత భాగంగా లష్కరే తోయిబాకు పేరుండగా ఆ దేశం సైన్యం ఈ స్థాయి పేలుడు పదార్థాలు, ఆయుధాలను దానికి సమకూరుస్తోంది.

డ్రోన్ల సేకరణపై కన్ను

గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు, ఆయుధాలు సమకూర్చుకొనే హడావుడిలో భారత్‌ ఉంటే.. పాక్‌ మాత్రం డ్రోన్ల శక్తిని పెంచుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం. టర్కీ, చైనా నుంచి భారీ ఎత్తున చిన్నసైజు మానవరహిత విమానాలు కొనుగోలు చేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. పాక్‌ సైన్యం 'సూపర్‌కామ్‌ 250' అనే మానవ రహిత విమానంతో నిఘా, సమాచార సేకరణ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జూన్‌ 24న నెస్‌కామ్‌ బుర్రాక్‌ మానవ రహిత విమానంతో ఒక లేజర్‌ గైడెడ్‌ క్షిపణిని పరీక్షించింది. పలు రక్షణ, శాస్త్ర సాంకేతిక విభాగాలు ఈ పరీక్షల్లో పాల్గొన్నాయి.

దేశీయంగా తయారీకి సన్నహాలు!

ఈ ఏడాది మే 31-జూన్‌11 మధ్య పాక్‌ వ్యూహాత్మక ప్రణాళిక విభాగం, ఇన్‌స్పెక్షన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ విభాగం సభ్యులు టర్కీ వెళ్లివచ్చారు. వీరు అక్కడ ఎంఎస్ బేరక్తర్‌ కుటుంబానికి చెందిన డ్రోన్ల ఫ్యాక్టరీని సందర్శించారు. తర్వాత బేరక్తర్‌ వీటీఓఎల్, టీబీ2 రకం డ్రోన్లను పాక్‌లోనే తయారు చేసే అంశంపై చర్చించారు. ఆ తర్వాత జర్మనీకి చెందిన ఆర్టోస్‌ డ్రోన్‌ రక్షణ వ్యవస్థ కొనుగోలుకు పాక్‌ డ్రోన్‌ రెగ్యులేటరీ అథారిటీ చర్యలు చేపట్టింది.జామింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థ డ్రోన్ల రాకపోకలను గమనిస్తుంది. ప్రస్తుతం.. పాకిస్థాన్‌ త్రివిధ దళాల సభ్యులు, ఇతరశాఖల బృందాలు చైనాలోని నోర్నికో ఫ్యాక్టరీ సందర్శనకు వెళ్లాయి. ఇక్కడ గగనతల యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను తయారు చేస్తారు. వీటిల్లో డ్రోన్లు కూడా ఉన్నాయి.

నిరాధార ఆరోపణలు

భారత్‌పై డ్రోన్‌ దాడులకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్న పాకిస్థాన్‌ దొంగే దొంగా దొంగా అన్నట్లు వ్యవహరిస్తోంది. భారత్‌ ఉగ్రవాదులకు నిధులు అందిస్తోందంటూ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ఆరోపించారు. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న భారత్‌ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు. లాహోర్‌లోని జోహార్‌ టౌన్‌లో లష్కరే తోయిబా నేత హఫీజ్‌ సయీద్‌పై దాడికి భారత్‌ నిధులు సమకూర్చిందని ఆరోపించారు. పాక్‌లో శాంతిభద్రతలకు భారత్‌ భంగం కలిగిస్తోందని తెలిపారు. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం పాక్ వాదనను తేలిగ్గా తీసుకుంటోందని వాపోయారు. ఇన్ని ఆరోపణలు చేసిన పాక్‌ మంత్రి ఎటువంటి ఆధారాలను మాత్రం చూపలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 6, 2021, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.