ETV Bharat / bharat

రేప్ చేసిన వ్యక్తితోనే బాధితురాలి పెళ్లి.. అయినా కేసు కొట్టివేతకు హైకోర్టు 'నో' - రేప్ కేసు నిందితునిపై కర్ణాటక హైకోర్టు

తనపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని తాను పెళ్లి చేసుకుని, ఓ పిల్లాడికి జన్మనిచ్చానని.. కాబట్టి నిందితుడిపై నమోదైన కేసును కొట్టివేయాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. న్యాయస్థానం ఆమె పిటిషన్​ను తిరస్కరించింది.

Karnataka High court
కర్ణాటక హైకోర్టు
author img

By

Published : Nov 25, 2021, 4:19 PM IST

తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నానని, తమకు సంతానం కూడా ఉన్నారని.. అందువల్ల నిందితునిపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఓ మహిళ అభ్యర్థనను(Rape survivor plea) కర్ణాటక హైకోర్టు(Karnataka high court) తోసిపుచ్చింది. నేర స్వభావం, తీవ్రత, సమాజంపై ప్రభావం కారణంగా తాము ఈ పిటిషన్​ను తిరస్కరిస్తున్నట్లు చెప్పింది.

విజయపురి జిల్లా బాసవానా బాగెవాడీలోని ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతున్న ఈ అత్యాచార కేసును కొట్టేయాలని బాధితురాలు, నిందితుడు(Victim accused couple) కర్ణాటక హైకోర్టుకు చెందిన కలబురిగి బెంచ్​ను ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిపై న్యాయ విచారణ కొనసాగితే కలిగే ప్రయోజనం ఏమీ లేదని బాధితురాలు తన పిటిషన్​లో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిన సమయంలో తన వయసు 19 ఏళ్లు అని చెప్పింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన జస్టిస్​ హెచ్​.పి.సందేశ్​ ధర్మాసనం.. బాధితురాలి అభ్యర్థనను తిరస్కరిస్తన్నట్లు చెప్పింది.

అత్యాచార బాధితురాలు మైనరా? మేజరా? అనే విషయం ట్రయల్ కోర్టు నిర్ధరిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఐపీసీ 376 సెక్షన్ కింద నిందితుడు మైనర్​పై అత్యాచారానికి పాల్పడి, బాధితులతో రాజీ కుదుర్చుకుంటే కేసు నుంచి తప్పించుకోలేడని పేర్కొంది. సీఆర్​పీసీ సెక్షన్ 482 కింద ఓ కేసును రద్దు చేసే ముందు నేర స్వభావం, తీవ్రతను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది.

మైనర్​పై అత్యాచారం కారణంగా ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసును నిందితుడు ఎదుర్కొంటున్నాడు.

ఇదీ చూడండి: 'రేప్​ చేసిన వ్యక్తితోనే పెళ్లి'కి సుప్రీం నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.