ETV Bharat / bharat

టీఎంసీ ఎంపీ అర్పిత ఘోష్​ రాజీనామా- కారణం అదేనా? - అర్పిత ఘోష్ రాజీనామా వార్త

తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ అర్పిత ఘోష్​(Arpita Ghosh resigns).. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆమోందిచారు. పార్టీ నాయకత్వం ఆదేశం ప్రకారమే ఆమె ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Arpita Ghosh resigns
అర్పిత ఘోష్​ రాజీనామా
author img

By

Published : Sep 16, 2021, 7:18 AM IST

తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ అర్పిత ఘోష్​(Arpita Ghosh resigns).. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె పంపిన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆమోందిచారని ఎగువసభ సచివాలయం బుధవారం వెల్లడించింది. ఆమె పనితీరుపై టీఎంసీ నాయకత్వం అసంతృప్తిగా ఉందని.. వారి ఆదేశం ప్రకారమే ఆమె ఎంపీ పదవికి రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీకి లేఖ రాశారు. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

"2021 ఎన్నికల్లో భారీ విజయం తర్వాత పార్టీలో నేను ఎలాంటి పాత్ర పోషించాలన్న దాని గురించి తీవ్రంగా ఆలోచించాను. పార్టీ కోసం పని చేసే అవకాశాన్నినాకు ఇస్తే మరింత ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. ఏదేమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో పని చేయాలన్న నా లక్ష్యం నెరవేరింది."

- అర్పిత ఘోష్​, టీఎంసీ నేత

2019 లోక్​సభ ఎన్నికల సమయంలో బలూర్​ఘాట్​ స్థానం నుంచి పోటీ చేసిన అర్పిత ఓటమి పాలయ్యారు. దీంతో ఆమెను 2020 మార్చిలో రాజ్యసభకు పంపింది టీఎంసీ.

ఇదీ చూడండి: 'మహిళా ఖైదీలకు సరైన పునరావాసం కల్పించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.