Rajput Karni Sena Chief Killed : రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. రాజస్థాన్ జైపుర్‌లోని శ్యామ్నగర్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. ఈ కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sukhdev Singh Gogamedi Shot Dead : రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ఉన్న ఇంట్లోకి నలుగురు దుండగులు ప్రవేశించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది, మరొకరు గాయపడ్డారు. అలాగే తీవ్ర గాయాలైన సుఖ్‌దేవ్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారని జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. బైక్‌పై దుండగులు సుఖ్‌దేవ్ సింగ్ ఇంటికి వచ్చారని పేర్కొన్నారు.
-
#WATCH | Rajasthan | Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, shot dead by unidentified bike-borne criminals in Jaipur. He was declared dead by doctors at the hospital where he was rushed to. Details awaited. pic.twitter.com/wGPU53SG2h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Rajasthan | Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, shot dead by unidentified bike-borne criminals in Jaipur. He was declared dead by doctors at the hospital where he was rushed to. Details awaited. pic.twitter.com/wGPU53SG2h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 5, 2023#WATCH | Rajasthan | Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, shot dead by unidentified bike-borne criminals in Jaipur. He was declared dead by doctors at the hospital where he was rushed to. Details awaited. pic.twitter.com/wGPU53SG2h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 5, 2023
అప్రమత్తమైన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్‌పై కాల్పుల వార్తలు తెలుసుకుని ఆయన అభిమానులు శ్యామ్నగర్కు భారీగా తరలివచ్చారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడికి మద్దతుగా జైపుర్‌లో నినాదాలు చేసి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండడం వల్ల పోలీసులు ఈ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
-
VIDEO | Supporters of Shri Rashtriya Rajput Karni Sena's president Sukhdev Singh Gogamedi, who was shot dead by unidentified assailants in Jaipur earlier today, hold a protest in the city.
— Press Trust of India (@PTI_News) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video available on PTI Videos - https://t.co/d8jp61xFcR) pic.twitter.com/gApUvY0KMC
">VIDEO | Supporters of Shri Rashtriya Rajput Karni Sena's president Sukhdev Singh Gogamedi, who was shot dead by unidentified assailants in Jaipur earlier today, hold a protest in the city.
— Press Trust of India (@PTI_News) December 5, 2023
(Full video available on PTI Videos - https://t.co/d8jp61xFcR) pic.twitter.com/gApUvY0KMCVIDEO | Supporters of Shri Rashtriya Rajput Karni Sena's president Sukhdev Singh Gogamedi, who was shot dead by unidentified assailants in Jaipur earlier today, hold a protest in the city.
— Press Trust of India (@PTI_News) December 5, 2023
(Full video available on PTI Videos - https://t.co/d8jp61xFcR) pic.twitter.com/gApUvY0KMC
అక్షయ్ కుమార్ టీమ్‌కు వార్నింగ్
Karnisena Warning Padmavati Team : గతంలో రాజ్‌పుత్ కర్ణిసేన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బాలీవుడ్లో కొన్నాళ్ల క్రితం వచ్చిన 'పద్మావత్' విడుదల విషయంలో అడ్డంకులు సృష్టించింది. సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేకర్స్‌ను హెచ్చరించింది. అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'పృథ్వీరాజ్'కు కర్ణిసేన నిరసన సెగ తగిలింది. రాజస్థాన్‌లో జైపుర్ దగ్గర షూటింగ్ జరుగుతుండగా కర్ణిసేన అడ్డుకుంది. అయితే కర్ణిసేనతో మాట్లాడిన చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్.. తాను పృథ్వీరాజ్ చరిత్రలో మార్పులేమీ చేయకుండానే సినిమా తీస్తున్నానని చెప్పారు. కానీ ఈ విషయంలో తమకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కర్ణిసేన కోరింది. దీనికి అంగీకరిస్తేనే షూటింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.