ETV Bharat / bharat

'గడ్డం' ఛాంపియన్​కు అవార్డులు దాసోహం - Beard man

గడ్డం పెంచుకొని.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి. అయితే.. గడ్డానికి అవార్డులు ఏంటా అనుకుంటున్నారా? తెలుసుకుందాం రండి.

Beard Champion
ఆయన గడ్డానికి అవార్డులు దాసోహం
author img

By

Published : Dec 6, 2020, 12:08 PM IST

నలుగురిలో విభిన్నంగా ఉండాలనే తపన.. ఆయన ఆహార్యాన్ని ప్రత్యేకంగా మార్చింది. రాజస్థాన్​లోని బిల్వారా జిల్లా షాహ్​పురా పట్టణానికి చెందిన మహమ్మద్​ ఇసాక్​ ఖాన్​ ఏళ్ల తరబడి గడ్డం పెంచేశాడు. ఏకంగా రెండు అడుగుల మేర పెరిగిపోయింది. ఇప్పుడదే అతనికి బోలెడంత గుర్తింపు తెస్తోంది. ఇసాక్​ ఖాన్​ను చూసేందుకే ప్రజలు తరచూ ఆయనింటికి వస్తుంటారు.

మహమ్మద్​ ఇసాక్​ ఖాన్​

" చిన్నతనం నుంచే ఏదైనా భిన్నంగా చేయాలన్న తనప ఉండేది. ఈ క్రమంలోనే గడ్డం పెచుకోవడం ఆసక్తిగా మారింది. నా గడ్డానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. గడ్డం అలంకరణ విషయంలోనూ 15 రాష్ట్రాలకు చెందిన 60 మందితో పోటీ పడి జాతీయ ఛాంపియన్​గానూ నిలిచా "

- మహమ్మద్​ ఇసాక్​ ఖాన్​, గడ్డం ఛాంపియన్​

గడ్డం విషయంలో ముందు ముందు మరిన్ని పోటీల్లో పాల్గొని, అవార్డులు గెలుచుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు ఇసాక్​. అయితే.. ఇలాంటి రికార్డులకే పరిమితం కాలేదు ఇసాక్​. స్థానికుల మన్ననతో షాహ్​పురాలో వార్డు కౌన్సిలర్​గానూ గెలిచాడు.

ఇదీ చూడండి:ఆ అధ్యక్షుడి గడ్డం వెనకున్న కథ ఇదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.