ETV Bharat / bharat

తాతా-మనవడి ఉమ్మడి విజయం.. ఒకేసారి డిప్లొమా పాస్ - బాన్స్​వాడ జిల్లా వార్తలు

Grandfather Grandson diploma: సంకల్ప బలం ముందు ఏ పనీ అసాధ్యం కాదని అంటుంటారు. ఈ అక్షరాల్ని నిజం చేసి చూపించారు రాజస్థాన్​కు చెందిన తాత- మనవళ్లు. అరవై ఏళ్లు పైబడిన వయసులో విశ్వవిద్యాలయ కోర్సు చేసిన వారు ఒకరైతే.. తొమ్మిదో తరగతి చదువుతూ.. కేవలం తాతయ్య మార్గదర్శనంలో డిప్లొమా ఫస్ట్​ క్లాస్​లో ఉత్తీర్ణులైన వారు మరొకరు. ఇంతకీ వారు చేసిన కోర్సు ఏంటంటే..

grandfather grandson
తాాతా-మనువడు
author img

By

Published : Dec 19, 2021, 1:32 PM IST

Grandfather Grandson diploma: ఏదైనా సాధించాలన్న తపనకు అభిరుచి తోడైతే.. వయసుతో నిమిత్తం లేకుండా అద్భుతాలు చేయడం ఖాయం. ఈ సూత్రాన్నే నమ్ముకున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తి, 14 ఏళ్ల బాలుడు.. డిప్లొమా ఫస్ట్​ క్లాస్​లో పాసయ్యారు.

grandfather grandson
తాాతా-మనువడు

ఆ భావాలే నడిపించాయ్..

రాజస్థాన్‌ బాన్స్​వాడ జిల్లా భగత్ సింగ్ కాలనీలో నివసించే రిటైర్డ్ ఉపాధ్యాయుడు శరద్ చంద్ర వ్యాస్‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఏదైనా అర్చకత్వ కోర్సు చేయాలని ముందునుంచీ భావించేవారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం వల్ల ఇన్నాళ్లూ కుదరలేదు. దీంతో పదవీ విరమణ చేశాక.. 'గోవింద్ గురు ట్రైబ్స్ యూనివర్శిటీ'లోని వేద విద్యాపీఠంలో డిప్లొమాలో చేరిపోయారు. అంతేగాక, ఆయన మనవడు హెనిల్ వ్యాస్‌ను కూడా ఈ కోర్సు చేసేలా ప్రోత్సహించాడు.

Ritual exams Rajasthan

హెనిల్ వ్యాస్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదేసమయంలో తన తాతయ్యతో కలిసి అర్చకత్వ కోర్సులో చేరాడు. రెండింటినీ ఒకేసారి చదివేందుకు తాతయ్య సహకరించేవారు. కాలేజీకి వెళ్లి తాను విన్న క్లాసులను రాత్రి సమయాల్లో మనవడికి నేర్పించేవారు శరత్ చంద్ర. ఆ విధంగా అర్చకత్వ కోర్సును ఇరువురూ అభ్యసించారు.

ఇంత కష్టపడి చదువుతున్న వీరిద్దరూ.. రెండు రోజుల క్రితం ప్రకటించిన ఫలితాల్లో ఫస్ట్ క్లాస్​లో ఉత్తీర్ణులయ్యారు. దీనితో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శరద్ చంద్ర వ్యాస్ 300 మార్కులకు 268 మార్కులు సాధించగా.. అతని మనవడు హెనిల్ 234 మార్కులు తెచ్చుకున్నాడు.

కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండే ఆధ్యాత్మిక వాతావరణమే తన విజయానికి కారణమని హెనిల్ వెల్లడించాడు.

"మా కుటుంబంలో ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వాధికారి​గా రిటైరైన తాతయ్య.. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నన్నూ మానసికంగా ప్రోత్సహించారు."

-హెనిల్ వ్యాస్

ఏకైక విశ్వవిద్యాలయం..

గోవింద్ గురు ట్రైబ్స్ యూనివర్శిటీ.. రాజస్థాన్​లో ఆధ్యాత్మిక విద్యనందించే ఏకైక విశ్వవిద్యాలయంగా పేరొందింది. అనేక రకాల మతపరమైన కోర్సులను అందిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.