ETV Bharat / bharat

Covid: అభాగ్యులకు రాజస్థాన్‌ ఆర్థిక భరోసా - అశోక్ గహ్లోత్‌

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది రాజస్థాన్​ ప్రభుత్వం. 18 ఏళ్ల వయస్సువచ్చే వరకు నెలకు రూ. 2,500 ఇస్తామని వెల్లడించింది. కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు సాయం చేస్తామని తెలిపింది.

Rajasthan
రాజస్థాన్‌ ఆర్థిక భరోసా
author img

By

Published : Jun 12, 2021, 9:22 PM IST

కొవిడ్‌(Covid)తో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులు, మహిళలకు రాజస్థాన్‌ ప్రభుత్వం ఊరటనిచ్చే కబురు వినిపించింది. ముఖ్యమంత్రి కరోనా బల్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించనున్నట్టు అశోక్ గహ్లోత్‌ సర్కారు శనివారం ప్రకటించింది.

తక్షణ సహాయం-రూ.1 లక్ష

కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.1 లక్ష అందజేయనున్నట్టు వెల్లడించింది. ఆ చిన్నారులకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు రూ.2,500 చొప్పున భృతిని కూడా అందించనున్నట్లు పేర్కొంది. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఉచితంగా ఉన్నత విద్యతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వివరించింది.

కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు కూడా రాష్ట్ర సర్కారు ఆర్థిక భరోసా కల్పించేందుకు నిర్ణయించుకుంది. వారికి తక్షణ సహాయం కింద రూ.1లక్షతో పాటు నెలకు రూ.1500 పింఛను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

కొవిడ్‌తో వితంతువులుగా మారిన మహిళల పిల్లలకు నెలకు రూ.1000 భృతితో పాటు వారి పుస్తకాలు, యూనిఫాం తదితర ఖర్చుల కోసం నెలకు రూ.2500 అందజేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రవేశాలకు.. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​తోనే సచిన్​.. సమస్యలకు తర్వలోనే పరిష్కారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.