Rajasthan Accident News Today : బస్సు-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఓ చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికార్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు.. నాగ్‌పుర్‌లో ఓ పెళ్లికి వెళుతున్నారు. బఠాండి గ్రామానికి చేరుకోగానే ఓ మలుపు వద్ద అర్ధరాత్రి వీరి కారు బస్సును ఢీకొట్టింది. ఫలితంగా ఏడుగురు మరణించారు. మలుపు మరి ఎక్కువగా ఉండటం వల్ల.. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని పోలీసులు తెలిపారు. అందుకే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపించినట్లు పేర్కొన్నారు. ఘటనపై మరిన్ని వివరాల తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఒకే కుటుంబంలో నలుగురు
Karnataka Accident News Today : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోనూ ఓ కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. 13వ జాతీయ రహదారిపై మల్లాపుర్ గ్రామ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రమాదం జరిగిన కారులో సంగనబసవ అతని భార్య రేఖ.. తమ ఇద్దరు కొడుకులు అగస్త్య, ఆదర్శ్, కూతురు అన్విక, వారి బంధువు భీమా శంకర్, డ్రైవర్ ఉన్నారు. విజయపుర జిల్లాలోని కుదరి సలవాడగి గ్రామానికి చెందిన సంగనబసవ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. వీరంతా శుక్రవారం రాత్రి విహారయాత్రల కోసం చిక్కమగళూరుకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి ఆదివారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
పొలంలో 14అడుగుల కింగ్ కోబ్రా.. ఏడాదిగా వ్యవసాయం బంద్!.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్
Generic Medicine NMC Guidelines : 'ఆ మందులు రాయకుంటే డాక్టర్ల లైసెన్స్ రద్దు'.. NMC కీలక ఆదేశాలు