ETV Bharat / bharat

నేడు దేశవ్యాప్తంగా రైతుల 'రైల్​రోకో' - రైలు రోకో

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రైల్​రోకో చేపట్టాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. గురువారం మధ్యాహ్నం 4 గంటల పాటు ఈ నిరసనలు చేపట్టనున్నారు కర్షకులు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టింది ఆర్​పీఎఫ్​. సుమారు 20వేల మంది బలగాలను మోహరించింది.

Rail roko
నేడు రైతు ఉద్యమకారులను రైల్​రోకో
author img

By

Published : Feb 18, 2021, 4:58 AM IST

Updated : Feb 18, 2021, 6:48 AM IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు నేడు దేశవ్యాప్తంగా రైల్​రోకో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరింది.

20వేల బలగాల మోహరింపు..

సంయుక్త కిసాన్​ మోర్చా.. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైల్​రోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి సిద్ధమైంది రైల్వే పరిరక్షణ దళం(ఆర్​పీఎఫ్​). సుమారు 20వేల మంది అదనపు బలగాలను దేశవ్యాప్తంగా మోహరించనుంది. ముఖ్యంగా పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్న కారణంగా ఆ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

రైలు ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు ఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ అరుణ్​కుమార్​. శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత జిల్లా అధికార యంత్రాంగంతో పర్యవేక్షిస్తున్నామని, స్థానికంగా కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: బంగాల్​ మంత్రిపై బాంబు దాడి

Last Updated : Feb 18, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.