ప్రభుత్వం రైతులను వేధిస్తోంది: రాహుల్ - farmer agitation entered its 100th day news
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు వందో రోజుకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతు బిడ్డలు దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కాపలా కాస్తుంటే.. వారి కోసం దిల్లీ సరిహద్దుల్లో మేకులు పాతిందని ధ్వజమెత్తారు.

దేశ సరిహద్దుల్లో రైతుల బిడ్డలు ప్రాణాలు లెక్కచేయకుండా పహారా కాస్తుంటే.. వారి కోసం దిల్లీ సరిహద్దుల్లో మేకులు పాతిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతు నిరసనలు వందో రోజుకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రాన్ని విమర్శించారు.
"దేశ సరిహద్దుల్లో తమ కొడుకులు ప్రాణాలు పణంగా పెట్టి కాపలా కాస్తుంటే.. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న వారి కోసం రహదారులపై మేకులు పాతారు. అన్నదాతలు హక్కుల కోసం పోరాడుతుంటే.. వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది." అని హిందీలో ట్వీట్ చేశారు రాహుల్.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధరకు చట్టపరంగా హామీ ఇవ్వాలనే డిమాండ్‌తో గతేడాది నవంబరు 28 తేదీ నుంచి.. దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన టిక్రీ, సింఘు, గాజీపుర్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు అన్నదాతలు. ఈ ప్రతిష్టంభన తొలగించడానికి కేంద్రానికి రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.
ఇదీ చూడండి: తమిళనాట 'షా' ఇంటింటి ప్రచారం- కేరళలో విజయ యాత్ర