Rahul Gandhi Comments on BRS : భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. జోడోయాత్రలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలని చెప్పారు. దేశాన్ని ఏకం చేసేందుకు జోడోయాత్ర చేశానని వివరించారు. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందని చెప్పారు. విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశానని వెల్లడించారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మీ మనసుల్లో.. మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని.. సభకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పీపుల్ మార్చ్ చేసిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. భట్టి వేల కి.మీ. పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Rahul Gandhi Interesting Comments Khammam Public Meeting : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్నందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి.. రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఓ స్వప్నంగా ఉండేదని.. పేదలు, రైతులు, అందరికీ ఓ స్వప్నమని వివరించారు. మీరు తలచిందొకటి.. బీఆర్ఎస్ చేసిందొకటని విమర్శించారు. టీఆర్ఎస్.. ఏకంగా తన పార్టీ పేరే మార్చుకుందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
Rahul Gandhi Fires on KCR : బీఆర్ఎస్ అంటే.. బీజేపీ బంధుత్వ పార్టీ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్.. తెలంగాణకు రాజులా భావిస్తుంటారని విమర్శించారు. తెలంగాణ తన జాగీరు అని ముఖ్యమంత్రి భావిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను సీఎం లాక్కున్నారని ఆక్షేపించారు. ఈ భూములు కేసీఆర్‌వి కావని.. ఈ భూములు మీవని.. ఈ భూములు మీ హక్కు.. కాంగ్రెస్ మీకు హక్కు ఇచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు.
Congress Meeting at Khammam : అవినీతిలో సీఎం కేసీఆర్ ఎవరికి తక్కువ కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ధరణి భూముల సమస్యను జోడోయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. మిషన్ భగీరథలోనూ వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి దోచుకున్నారని ఆక్షేపించారు. పార్లమెంటులో బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
"మిషన్ భగీరథలోనూ వేల కోట్లు దోచుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారు. అన్ని రంగాలను సీఎం కేసీఆర్ దోచుకున్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోంది. సాగు చట్టాల బిల్లును బీఆర్ఎశ్ స్వాగతించింది. మోదీ ఏం చేసినా కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్ రిమోట్.. ప్రధాని మోదీ చేతుల్లో ఉంది." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఇవీ చదవండి: Khammam Pubilc Meeting : 'జనగర్జన'లో పోటెత్తిన అభిమానం.. రాహుల్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం
Ponguleti Joins in Congress : 'లక్షలాది తెలంగాణ బిడ్డల కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరా'