కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రణాళిక లేని లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేదరికంలోకి జారుకున్నారని ఆరోపించారు. ఎంతో మంది ఆరోగ్యాం ప్రమాదంలో పడిందన్నారు. డిజిటల్ విభజనతో విద్యార్థుల తమ భవిష్యత్తో రాజీ పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ నివేదక ఆధారంగా.. ట్విట్టర్లో విమర్శలు చేశారు రాహులు.
'ఇవన్నీ ప్రభుత్వం తన అబద్ధాలతో కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న కఠోర నిజాలు' అని రాహుల్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
ఓ పత్రికా కథనాన్ని ఉటంకిస్తూ.. హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబానికి రక్షణ లేదని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు రాహుల్.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారా?