ETV Bharat / bharat

సంగీతంపై ప్రేమతో ఇంటికి గిటార్​ రూపం - గిటార్​ ఆకారంలో ఇంటి నిర్మాణం

సంగీతం అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆయనకు ప్రాణం. ఎంతగా ఈ కళను ఆదరిస్తాడో తన ఇంటిని చూస్తేనే తెలుస్తుంది. సంగీతంపై అమితమైన ప్రేమతో.. ఏకంగా ఇంటినే 'గిటార్​హౌస్​'గా మార్చాడు. మినీ సంగీత ప్రపంచంలా కనిపించే ఈ ఇంట్లో అన్ని రకాల సంగీత వాయిద్యాలను ఏర్పాటు చేశాడు. తన కళను మరికొంత మందికి నేర్పుతూ స్థానికుల ఆదరాభిమానాలు పొందే ఆ సంగీత ప్రియుడిపై ప్రత్యేక కథనం..

GUITAR HOUSE IN HARIDWAR IN UTTARAKHAND
సంగీతంపై ప్రేమతో.. ఇంటినే గిటారుగా..
author img

By

Published : Mar 4, 2021, 3:45 PM IST

సంగీతానికి కేరాఫ్​గా నిలుస్తోన్న గిటార్ ​హౌస్​

రాహుల్ అరోరా.. ఉత్తరాఖండ్ హరిద్వార్​ వాసి అయిన ఈ 35ఏళ్ల వ్యక్తికి, సంగీతానికి ప్రత్యేక అనుబంధముంది. ఆ ప్రేమకు ఓ రూపం ఇచ్చేందుకు ఇంటినే గిటార్ ఆకారంలో కట్టేశాడు. ఆకర్షణీయంగా కొలువుదీరిన ఆ ఇల్లు అటుగా వెళ్లే వారందర్నీ ఆకట్టుకుంటుంది.

లోపల అందంగా అలంకరించిన పియానో, డ్రమ్స్, వయోలిన్లు సంగీత ప్రపంచంలోకి తీసుకునివెళ్తాయి.

ఉచిత బోధన

గిటార్​పై ఉన్న మక్కువతో చిన్నారులకు సంగీతపాఠాలు చెబుతున్నాడు రాహుల్​. పేద పిల్లలకు ఉచితంగానే సంగీత బోధన చేస్తున్నాడు. నగరంలోని ఈ గిటార్ హౌస్​ను చూసి చిన్నారులు, యువత అబ్బురపోతుంటారు. ఆ లోపలి నుంచి వినిపించే సంగీతంతో.. తమకూ నేర్చుకునే అవకాశం కల్పించమని కోరుతుంటారు.

హరిద్వార్​ స్థానికులకు ఇప్పుడీ గిటార్​ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. గిటార్ ఆకారంలో నిర్మాణం జరుగుతున్నప్పుడే అక్కడేదో ప్రత్యేక కట్టడం వస్తోందని అనుకున్నట్లు స్థానికులు చెబుతారు.

స్థానిక గుర్తింపు

మొత్తం మీద.. రాహుల్ అరోరా తన నైపుణ్యంతో ఇలా స్థానికంగా ప్రత్యేక గుర్తింపును సాధించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యటకులు కంకాల్​దక్ష ఆలయం సమీపం లోని గిటార్​ హౌస్​ను తప్పక సందర్శిస్తారు. ఈ ఇల్లు ఆకృతితోనే కాకుండా.. అక్కడ నేర్పే సంగీత పాఠాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించాలని అక్కడివారు కోరుకుంటూ ఉంటారు.

ఇదీ చదవండి: పిల్లల పరీక్షల కోసం టీచర్ల వేకప్​ కాల్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.