లండన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్‌కు చెందిన పలు యూనివర్సిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాయి. సంస్థాగత పరిశోధన విభాగం (సీపీఎఫ్)లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ప్రపంచంలోనే అగ్రగామి విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఈ విభాగంలో ఐఐటీ గువాహటి 41వ స్థానంలో నిలిచింది.
అయితే పూర్తి స్థాయి ర్యాంకింగ్‌లో మాత్రం భారత్‌లోని విశ్వవిద్యాలయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో గతంలో కంటే 4 ర్యాంకులు దిగజారి ఐఐటీ-బాంబే 177 ర్యాంకుకు పడిపోయింది. ఐఐటీ దిల్లీ 193వ స్థానంలో నిలిచింది.
యాజమాన్య ప్రతిష్ట, సంస్థ ప్రతిష్ట, సంస్థాగత పరిశోధన, బోధనా సిబ్బంది- విద్యార్థి నిష్పత్తి, అంతర్జాతీయ స్థాయి బోధనా సిబ్బంది వంటి ఆరు ప్రామాణిక అంశాల ఆధారంగా ఏటా 'క్యూఎస్' సంస్థ విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ ర్యాంకుల్లో ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయంగా వరుసగా పదోసారి అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగ్రస్థానంలో నిలిచింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రెండోస్థానం కైవసం చేసుకోగా, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం మూడో ర్యాంకు సాధించింది.
ఇవీ చదవండి: ప్రజాస్వామ్య సూచీలో 53కు పడిపోయిన భారత్