ETV Bharat / bharat

'పుష్ప.. ది స్క్రైబ్​'.. 1000+ పరీక్షలు రాసి వారందరికీ సాయం - బెంగళూరు స్క్రైబ్​ 16 ఏళ్లు

దివ్యాంగులు.. ఉద్యోగం సాధించేందుకు ఎంత కష్టపడి చదివినా.. పరీక్ష రాసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. 16 ఏళ్లుగా అండగా నిలుస్తున్నారు. స్క్రైబ్​గా ఉచితంగా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 1000కు పైగా పరీక్షలు రాశారు. అసలు ఆమె ఎవరు? స్కైబ్​గా మారడానికి కారణాలేంటి?

Pushpa Scribec
Pushpa Scribe
author img

By

Published : Jul 5, 2023, 7:41 PM IST

Updated : Jul 5, 2023, 8:07 PM IST

ప్రభుత్వ కొలువు సంపాదించేందుకు చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించి చదువుతుంటారు. చదివినవన్నీ పరీక్షాపత్రంపై రాసి ఉద్యోగం కొట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. అయితే ఇదంతా.. సాధారణ వ్యక్తులకు! కానీ దివ్యాంగులకు మాత్రం అలా కాదు. వాళ్లు ఎంత కష్టపడి చదివినా మరొకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. స్క్రైబ్​ సహాయంతోనే పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన పుష్ప అనే మహిళ.. ఇప్పటి వరకు స్క్రైబ్​గా 1000కు పైగా పరీక్షలు రాశారు. 16 సంవత్సరాలుగా దివ్యాంగులకు ఉచితంగా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. ఆమె గురించి ఓసారి తెలుసుకుందాం.

Pushpa Scribe : దొడ్డబళ్లాపురకు చెందిన పుష్ప ప్రియ.. కొన్నాళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల కుటుంబంతో బెంగళూరు వచ్చేశారు. పుష్ప తండ్రి కాంట్రాక్ట్​ వర్కర్​గా బెంగళూరులో పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబానికి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.

పుష్పతో పాటు ఆమె సోదరుడిని చదివించేందుకు వారి తల్లి.. స్థానికంగా ఉన్న ఇళ్లల్లో పనిచేసింది. అలా వారిద్దరికీ ఉన్నతమైన విద్య అందించింది. అయితే 2007లో ఒకరోజు బయటకు వెళ్లేందుకు పుష్ప ఓ బస్సు ఎక్కారు. ఆ ప్రయాణంలో అంధుడైన ఓ వ్యక్తిని ఆమె కలుసుకున్నారు. ఇద్దరూ పలు విషయాలపై కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో అతడు.. పుష్పను ఓ కోరిక కోరాడు. తాను హాజరవ్వబోయే పరీక్షకు స్క్రైబ్​గా ఉండాలని అడిగాడు. అందుకు పుష్ప అంగీకరించి పరీక్ష రాశారు.

అలా అప్పటి నుంచి 2021 వరకు.. ఏ ఉద్యోగం చేయకుండా కేవలం దివ్యాంగులకు స్క్రైబ్​గా పరీక్షలు రాస్తూనే గడిపారు పుష్ప. కానీ ఆ తర్వాత బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అయినా ఇప్పటికీ స్క్రైబ్​గా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. తన యజమాని చాలా మంచి వ్యక్తిని.. స్క్రైబ్​గా పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు సెలవులు ఇస్తున్నారని చెప్పారు. తాను మొదటిసారి స్క్రైబ్​గా పరీక్ష రాసినప్పుడు.. చాలా భయపడ్డానని అన్నారు పుష్ప. ఏదైనా తప్పు రాస్తే.. అభ్యర్థి మార్కులు కోల్పోతారనే భయంతో పరీక్ష రాశానని తెలిపారు. తాను ఎవరికీ ఆర్థికంగా సహాయం చేయలేనని.. అందుకే స్క్రైబ్​గా పరీక్షలు రాయడమే పెద్ద సహాయంగా భావిస్తున్నట్లు చెప్పారు.

  • scribe for today.
    After long time i am taking new student adoc request to be there scribe and this little girl tells me to write her rest of the exams so nice to hear from her pic.twitter.com/PgYXqT4MOy

    — pushpapreeya President of India Awardee (@pushpapreeya1) August 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Requirement for scribe are there request you all to support near by your place and support them
    Today morning had a chance to be a scribe for Cute little Divya visually impaired student who is doing her BA first grade at Vijayanagar Govt college Bangalore and happy to be her pic.twitter.com/F3HKKrjUW8

రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం..
సామాజిక కార్యకర్త పుష్పకు కేంద్ర ప్రభుత్వం.. 2018లో నారీశక్తి పురస్కారం ప్రకటించింది. ఆ తర్వాత 2019 మార్చి 8న అప్పటి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా పుష్ప.. నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. కొన్ని నెలల క్రితం.. పుష్ప కర్ణాటక బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించుకున్నారు.

  • Warm birthday greetings to Hon. President Shri Ram Nath Kovind Your journey from a humble family to the highest Constitutional position of the country is an pic.twitter.com/L25galyEYH

    — pushpapreeya President of India Awardee (@pushpapreeya1) October 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పుష్ప ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో 1080కిపైగా పరీక్షలు రాశారు. స్క్రైబ్​గా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా పుష్ప వివరించారు. అవి ఆమె మాటల్లోనే...

  • 1070 exams, my inscription in the Karnataka Book of Records was created for 8 categories of specially abled people. Thank you to all of the students who put their faith in me and allowed me to be scribe. pic.twitter.com/Bxxxj6sxjN

    — pushpapreeya President of India Awardee (@pushpapreeya1) March 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఓపిక..
మరొకరి పరీక్షలు రాయాలంటే ఓపిక చాలా ముఖ్యమని పుష్ప అభిప్రాయపడ్డారు. "పరీక్ష హాలులో కూర్చుని గంటలు గడపవలసి ఉంటుంది. కొన్నిసార్లు అభ్యర్థి చాలా నెమ్మదిగా లేదా వేగంగా మాట్లాడవచ్చు. వారు మిమ్మల్ని ప్రశ్నలను మళ్లీ మళ్లీ చెప్పమని అడగవచ్చు. ఈ విషయాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. కొన్నిసార్లు అలసిపోయేలా చేస్తాయి. కాబట్టి ఓపిక చాలా అవసరం" అని ఆమె చెప్పారు.

వినగలిగే శక్తి
స్క్రైబ్​గా పరీక్షలు రాయాలనుకంటే మంచి శ్రవణానైపుణ్యాలు కలిగి ఉండాలని పుష్ప తెలిపారు. "పరీక్ష బాగా రాయడం అనేది మీ శ్రవణానైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. పరీక్షా కేంద్రంలో పరధ్యానంలో ఉండకూడదు. సమాధానం మళ్లీ మళ్లీ చెప్పమని అడిగితే.. వారు (పరీక్షా అభ్యర్థి) భయాందోళనకు గురవుతారు. అందుకే ఒక్కసారికే సమాధానం చక్కగా విని రాయాలి" అని పుష్ప చెప్పారు.

బాధ్యత
పరీక్షా రాస్తున్న సమయంలో తమ బాధ్యత గుర్తుంచుకోవాలని పుష్ప సూచించారు. "మీపై సదరు వ్యక్తి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందుకే పరీక్ష రాస్తున్నంతసేపు మీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి" అని ఆమె తెలిపారు.

ఏకాగ్రత
బాధ్యతతోపాటు ఏకాగ్రత కూడా ముఖ్యమని పుష్ప తెలిపారు. "వైకల్యం కలిగి ఉన్న కొందరు అభ్యర్థులు సున్నితంగా ఉంటారు. వారిని గౌరవించాలి. అందరితో సమానంగా చూడాలి. వారు చెప్పిన సమాధానాలను శ్రద్ధగా రాయాలి. అభ్యర్థి చెప్పేది ఏకాగ్రతతో వినాలి" అని పుష్ప చెప్పారు.

Last Updated : Jul 5, 2023, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.