కరోనా కారణంగా మూతబడిన ఒడిశా పూరీలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయం తొమ్మిది నెలల తర్వాత తెరుచుకుంది. వేదమంత్రోచ్ఛరణలతో స్వామి వారికి అర్చకులు పూజలు నిర్వహించారు.
జగన్నాథస్వామిని దర్శించుకునేందుకు వార్డుల వారీగా జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కేటాయించిన తేదీ, షిఫ్టుల ఆధారంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారికే ఆలయ ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. పుష్పాలు, తులసి వంటి పూజాసామగ్రిని గుడి లోపలకు అనుమతించడం లేదని వెల్లడించారు.