ETV Bharat / bharat

ఫిబ్రవరి 1 నుంచి భక్తులకు 'పూరీ జగన్నాథుడి' దర్శనం - తెరుచుకున్న పూరీ ఆలయం

Puri Jagannath temple open: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. భక్తుల సెంటిమెంట్లు, కరోనా తగ్గుముఖం పట్టటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని ఫిబ్రవరి 1న తెరవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు పూరీ కలెక్టర్​. పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.

Puri Jagannath temple
పూరీ జగన్నాథ ఆలయం
author img

By

Published : Jan 28, 2022, 8:49 PM IST

Updated : Jan 28, 2022, 9:06 PM IST

Puri Jagannath temple open: కొవిడ్​ వల్ల మూతపడిన ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయం ఫిబ్రవరి 1న తెరుచుకోనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. శానిటైజేషన్​ చేసేందుకు ఆదివారాలు మూసి వేయనున్నట్లు పూరీ జిల్లా కలెక్టర్​ సమర్థ్​ వర్మ తెలిపారు.

శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం(ఎస్​జేటీఏ), ఆలయ సేవలకుల సంఘంతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు కలెక్టర్​.

" స్థానికుల ఆదాయం ఎక్కువగా ఆలయంపైనే ఆధారపడి ఉంది. దీంతోపాటు ప్రజల సెంటిమెంట్లు, కరోనా తగ్గుముఖం పట్టటాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1న పూరీ ఆలయాన్ని తిరిగి తెరవాలని నిర్ణయించాం. స్థానిక పరిస్థితుల మేరకు పండగల రోజుల్లో ఆలయం మూసి ఉంటుంది. తూర్పు ద్వారం(సింహ ద్వారం) ద్వారా మాత్రామే భక్తులను అనుమతిస్తారు."

- సమర్థ్​ వర్మ, పూరీ జిల్లా కలెక్టర్​

పూరీ జగన్నాథుడి దర్శనానికి పూర్తిస్థాయి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు కలెక్టర్​. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దర్శనాల సమయాన్ని అందులో పేర్కొంటామన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగటం, పలువురు ఆలయ పూజారులు, సేవకులు కరోనా బారినపడిన నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు జగన్నాథుడి ఆలయాన్ని మూసివేసింది ఎస్​జేటీఏ. అయితే, సాధారణ పూజలు, ఇతర కార్యక్రమాలు ప్రతి రోజు నిర్వహించారు.

అంతకు ముందు శ్రీ జగన్నాథ సేన, స్థానిక సంస్థలు.. ఆలయాన్ని తెరవాలని గుడి ముందు ఆందోళనకు దిగాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 61 ఏళ్ల వయసులో 'నీట్​' పాస్​.. ఎంబీబీఎస్ సీటు త్యాగం

Last Updated : Jan 28, 2022, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.