నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామా నేపథ్యంలో ఈ నెల 22న శాసనసభలో బలం నిరూపించుకోవాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
పుదుచ్చేరి శాసనసభలో మొత్తం 33 మంది సభ్యులు ఉండగా వివిధ రకాల కారణాలతో అయిదు ఖాళీలు ఉన్నాయి. మెజార్టీకి
15 మంది అవసరమవగా, నలుగురు శాసనసభ్యుల రాజీనామాతో కాంగ్రెస్-డీఎంకే కూటమి బలం 14కు పడిపోయింది. విపక్షాలకు కూడా 14 మంది సభ్యులు ఉన్నారు. పుదుచ్చేరి శాసనసభకు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగనుండగా.. అంతలోనే రాజకీయ సంక్షోభం తలెత్తింది.
ఇదీ చదవండి:పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు