ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. యూపీలో 403 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక కూటమిగా బరిలోకి దిగుతుందా అనే విలేకరుల ప్రశ్నలకు ఈ మేరకు ప్రియాంక బదులిచ్చారు. ఎన్నికల్లో భాజపాను ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు చెప్పారు.
అటు కరోనా వేళ కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల పనిచేసిందని ప్రియాంక అన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు చెప్పారు. యూపీలో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ శక్తి సామర్థ్యాల మేర పనిచేస్తున్నట్లు వివరించారు.
రాహుల్, ప్రియాంకను రాజకీయ పర్యటకులుగా భాజపా అభివర్ణించడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తమను ఆసక్తిలేని రాజకీయ నాయకులుగా ప్రచారం చేయడమే భాజపా లక్ష్యం అని ఆరోపించారు.
ఇవీ చదవండి:ప్రతిపక్షాలు గళమెత్తకుంటే.. ప్రమాదంలో రాజకీయ భవిష్యత్తు!