ETV Bharat / bharat

'తగ్గిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు' - mrp of oxygen concentraotrs

ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల ట్రేడ్​ మార్జిన్​పై ప్రభుత్వం పరిమితి విధించడం వల్ల వాటి ధరలు 50శాతానికి పైగా తగ్గాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వినియోగదారులకు ఉపశమనం కలిగిందని పేర్కొంది.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
Oxygen Concentrators price
author img

By

Published : Jun 12, 2021, 7:49 AM IST

మహమ్మారి సమయంలో కీలకంగా మారిన ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల(oxygen concentrators) ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వినియోగదారులకు మేలు చేకూరిందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల ట్రేడ్​ మార్జిన్​పై ప్రభుత్వం పరిమితి విధించడం వల్ల వాటి ధరలు 50శాతానికి పైగా తగ్గాయని, ఆ మేరకు వినియోగదారులకు ఉపశమనం కలిగిందని పేర్కొంది.

ఈ నెల 3 నుంచి జాతీయ ఔషధ ఉత్పత్తుల ధరల నియంత్రణ సంస్థ(ఎన్​పీపీఏ) ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల ట్రేడ్​ మార్జిన్​ను డిస్ట్రిబ్యూటర్​ ధరలపై 70 శాతానికి పరిమితం చేసింది. దీంతో 104 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల తయారీ/దిగుమతి సంస్థలు 252 బ్రాండ్లు/ఉత్పత్తులకు సంబంధించి కొత్త గరిష్ఠ చిల్లర ధరలను సమర్పించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 70 బ్రాండ్ల కాన్సంట్రేటర్లు పాత ధరలతో పోలిస్తే ఒక్కో యూనిట్​కు రూ.54,337 మేర(54శాతం) తగ్గిందని పేర్కొంది. 58 బ్రాండ్లు 25శాతం వరకు, 11 బ్రాండ్లు 26-50శాతం వరకు ధరలు తగ్గించాయని, 18 దేశీయ బ్రాండ్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది.

ఇదీ చూడండి: Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

ఇదీ చూడండి: Oxygen Concentrator: హైకోర్టు తీర్పును నిలిపేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.