ETV Bharat / bharat

కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీకి నిప్పు.. వారంపాటు నరకం అనుభవించి మృతి - అదనపు కట్నం కోసం గర్భిణీకి నిప్పంటించిన భర్త

Pregnant Woman Set on Fire : అదనపు కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఆమె భర్త. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. వారం రోజుల చికిత్స అనంతరం మృతి చెందింది. బంగాల్​లోని మాల్డా జిల్లాలో ఈ దారుణం జరిగింది.

pregnant-woman-set-on-fire-west-bengal-four-month-pregnant-woman-died-during-treatment
బంగాల్ నాలుగు నెలల గర్భిణీ సజీవ దహనం
author img

By

Published : Aug 8, 2023, 2:28 PM IST

Pregnant Woman Set on Fire : నాలుగు నెలల గర్భిణీపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఆమె భర్త. మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని.. అదనపు కట్నం కోసం భార్యపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అందుకు అతడి కుటుంబ సభ్యులు కూడా సాయం చేశారు. అనంతరం అందరూ కలిసి పారిపోయారు. కాలిన గాయలతో వారం రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. సోమవారం మృతి చెందింది. బంగాల్​లోని మాల్డా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రతువా బ్లాక్ 2 లోని అజిమ్‌గంజ్​కు చెందిన అకాలు రబిదాస్, ప్రియాంక(23) మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో తన సామర్థ్యం మేరకు కొంత కట్నాన్ని అల్లుడికి ఇచ్చాడు ప్రియాంక తండ్రి రాజ్​కుమార్. అయినప్పటికీ అదనపు కట్నం కోసం ప్రియాంకను పదే పదే వేధించేవాడు అకాలు. కూతురు దుస్థితిని చూసి.. అప్పుడప్పుడు కొంత సొమ్మును అల్లుడికిచ్చేవాడు రాజ్​కుమార్​. కొద్ది రోజుల క్రితం కూడా తన తండ్రి దగ్గరి నుంచి లక్ష రూపాయలు తీసుకురావాలని ప్రియాంకను వేధించారు భర్త, అతని కుటుంబ సభ్యులు. అయితే అంత డబ్బును ఇచ్చేందుకు ప్రియాంక తండ్రి నిరాకరించాడు.

గర్భిణీని దారుణంగా కొట్టి నిప్పు..
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అకాలు, అతని కుటుంబ సభ్యులు.. ఆగస్టు 1న ప్రియాంకను దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమెపై పెట్రోల్​ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ రోదిస్తున్న ప్రియాంకను చుట్టుపక్కల వాళ్లు చూసి రక్షించారు. వెంటనే ఆమె పుట్టింటి వారికి సమాచారం అందించి.. మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​కు తరలించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక.. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన అనంతరం అల్లుడు, అతని కుటుంబ సభ్యులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రియాంక తండ్రి రాజ్​కుమార్​. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

భారత్​లో అన్న.. పాకిస్థాన్​లో చెల్లి..​ 76 ఏళ్ల తర్వాత కలుసుకొని తీవ్ర భావోద్వేగం..

13 ఏళ్ల బాలికపై 28 రోజులుగా గ్యాంగ్​రేప్​.. కిడ్నాప్​ చేసి దారుణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.