ETV Bharat / bharat

భుజంపై కుమారుడి మృతదేహం.. కిలోమీటర్ల పాటు నడక.. ఆర్మీ సాయంతో.. - ప్రయాగ్​రాజ్ పోలీసు కమిషనర్

కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఓ తండ్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందికి విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో భుజాలపైనే కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

father carrying son body on shoulder
మృతదేహం
author img

By

Published : Aug 4, 2022, 10:16 AM IST

కుమారుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి

ఉత్తర్​ప్రదేశ్ ప్రయాగ్​రాజ్​లో అమానవీయ ఘటన జరిగింది. 14 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాడు ఓ తండ్రి. మృతదేహాంపై ప్లాస్టిక్ కవర్ కప్పి భార్యతో కలిసి కిలోమీటర్లు నడుచుకుంటూ మోసుకెళ్లాడు. వీరికి దారిలో ఓ వ్యక్తి సాయం చేశాడు.

అసలేం జరిగిందంటే:
ప్రయాగరాజ్​లోని కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బజరంగీ కుమారుడు శివమ్ మంగళవారం​ కరెంట్ షాక్​కు గురయ్యాడు. దీంతో బజరంగీ, అతని భార్య సావిత్రి కలిసి ఎస్ఆర్​ఎన్ ఆసుపత్రికి కుమారుడిని హుటాహుటిన తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివమ్ చనిపోయాడు. ఆ తర్వాత బాలుని మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం విజ్ఞప్తి చేసినా.. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఎంత బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది.

చేసేదేమీ లేక భుజాలపై కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లాడు బజరంగీ. అంతలో ఓ వ్యక్తి ఆయనకు సాయం చేశాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం వీరికి సాయం చేసింది. మృతదేహాన్ని మోసుకెళ్తుండటాన్ని చూసిన ఆర్మీ అధికారులు చూసి.. రహదారిపై వెళ్తున్న ఓ అంబులెన్స్​ను ఆపారు. అందులో శివమ్ మృతదేహం తరలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో, బజరంగీ.. శివమ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లగలిగాడు. ఈ ఘటనపై స్పందించిన ప్రయాగ్​రాజ్ కమిషనర్ విజయ్ విశ్వాస్.. ఉన్నత స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: NEXT CJI: కీలక తీర్పుల్లో భాగస్వామి... తర్వాతి సీజేఐ ఈయనే

దీదీ సర్కార్​ దిద్దుబాటు చర్యలు.. కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ.. బాబుల్​ సుప్రియోకు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.