ETV Bharat / bharat

అప్పుల కోసం ఇంట్లో గొడవ- భార్యాపిల్లలను చంపేసిన పోస్ట్​మ్యాన్- ఆపై సూసైడ్!

Postman Family Death : ఇంట్లో అప్పుల విషయమై గొడవ జరగడం వల్ల తన కుటుంబసభ్యులను చంపేశాడు ఓ పోస్ట్​మాస్టర్. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్​లో జరిగిందీ ఘటన. మరోవైపు, మధ్యప్రదేశ్​లో ఓ మహిళ తన భర్తతోపాటు బావను కాల్చి చంపేసింది.

Postman Family Death
Postman Family Death
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 9:38 AM IST

Postman Family Death : పంజాబ్​లోని జలంధర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. అప్పుల విషయంలో గొడవ జరగడం వల్ల ఓ పోస్ట్ మాస్టర్ తన కుటుంబసభ్యులందరినీ చంపేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణాలు కోల్పోయిన పోస్ట్ మాస్టర్​ను మన్మోహన్ సింగ్​గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- జిల్లాలోని ఆదంపుర్ పోస్టాఫీస్​లో మన్మోహన్ సింగ్(55) ఇన్​ఛార్జ్​గా పనిచేస్తున్నారు. అతడి పెద్ద కుమార్తె జ్యోతికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవలే ఆమె తన కుమార్తెతో పుట్టింటికి వచ్చింది. కొన్నిరోజులుగా ఆమెకు తన భర్త సరబ్​జిత్ సింగ్​ ఫోన్​ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన అతడు మిగతా కుటుంబసభ్యులతో కలిసి మన్మోహన్ సింగ్ ఇంటికి వచ్చాడు.

తలుపు బద్దలుగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమచారం అందించాడు. ఆదంపుర్ డీఎస్పీ సోమవారం రాత్రి 8.20 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో సూసైడ్​ నోట్​ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

postmaste
పోస్ట్​మాస్టర్ కుటుంబం

"ఆర్థిక ఇబ్బందులు కారణంగా అప్పు చేశాను. ఈ విషయం ఇంట్లో తెలిసింది. దీంతో పెద్ద గొడవ అయింది. అందుకే ఈ చర్యకు పాల్పడ్డాను" అని మన్మోహన్ సింగ్ ఆ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులందరి మెడపై ఉరేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. భార్య సరబ్జిత్ కౌర్, కుమర్తెలు జ్యోతి, గోపీ, మనమరాలు అమన్​ను ఉరేసి చంపేసి మన్మోహన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు.

భర్త, బావను చంపిన మహిళ
మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని జిల్లాలో ఓ మహిళ తన భర్తతోపాటు బావను తుపాకీతో కాల్చి చంపేసింది. ఈ ఘటనలో ఆమె భర్త అక్కడికక్కడే మృతి చెందగా, బావ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత నిందితురాలు పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది.

పోలీసుల సమాచారం ప్రకారం- జిల్లాలోని బాద్​నగర్​ ప్రాంతానికి చెందిన అంగన్​వాడీ వర్కర్ సవితా కుమారి తన ఇంట్లో ఉన్న పిస్టల్​తో తన భర్త రాధేశ్యామ్​పాటు బావ ధీరజ్​ కుమార్​పై ఆరుసార్లు కాల్పులు జరిగింది. అందులో ఓ బుల్లెట్ రాధేశ్యామ్​ తలలోకి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ధీరజ్ కుమార్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

అయితే హత్యలు చేసిన తర్వాత సవితా కుమారి నేరుగా పోలీస్​స్టేషన్​కు వెళ్లింది. మొత్తం కథను పోలీసులకు చెప్పింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే భూవివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. కానీ స్థానికులు మాత్రం వేరేలా చెబుతున్నారు.

"రాధేశ్యామ్ ఏ పనీ చేయడు. అక్రమ ఆయుధాలు విక్రయించినందుకు ఇప్పటికే అతడిపై మూడు కేసులు నమోదయ్యాయి. సవితను చిత్రహింసలకు గురిచేసేవాడు. సవిత తన ఇద్దరు కుమార్తె పెళ్లి ప్రస్తావన తెచ్చేది. ఆ సమయంలో రాధేశ్యామ్​తో పాటు అతడి సోదరుడు సవిత కుమర్తె క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడేవారు. వాటన్నింటిని తట్టుకోలేక సవిత ఇలా చేసింది" అని స్థానికులు తెలిపారు.

కానిస్టేబుల్​కు నిప్పంటించి హత్య చేసిన ప్రేయసి- వాంగ్మూలం మార్చి మరీ చనిపోయిన పోలీస్!

స్నేహితురాలితో ట్రాన్స్​జెండర్​ లవ్​! కాదనేసరికి కాళ్లు, చేతులు కట్టేసి సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.