Rave Party In MLA Resort: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన ఓ రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీ పై చెన్నై పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఈసీఆర్‌లోని పనైయూర్‌లోని ఓ రిసార్ట్‌పై రైడ్ చేశారు. తాంబరం పోలీస్ కమిషనర్ ఎం.రవి నేతృత్వంతో ఈ దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ రైడ్‌లో సుమారు 500 మందికి పైగా యువత పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రిసార్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన హసన్ మౌలానాకు చెందినదిగా గుర్తించారు.
ఈ రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు కోట్ల రూపాయలు విలువైన కొకైన్, డ్రగ్స్, గంజాయి, ఫారెన్ లిక్కర్, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిలో పట్టుబడిన యువకులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డిప్రెషన్ నుంచి బయటపడే పేరుతో డ్రగ్స్‌కు అలవాటు పడవద్దని కమిషనర్ రవి యువకులకు సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే ముందు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని అన్నారు.
ఇదీ చూడండి: