లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు మధ్యప్రదేశ్ పోలీసులు. బయట కనిపించినవారిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి నమూనాలను పరీక్షిస్తున్నారు.
అత్యవసర పని మీద బయటకు వచ్చే వారిని వదిలేస్తున్నట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. అనవసరంగా తిరిగేవారికే పరీక్షలు చేసి, వారి నుంచి జరిమానాలను సైతం వసూలు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: కలెక్టర్ అత్యుత్సాహం- యువకుడి చెంప చెళ్లు!
సరైన ఈ-పాస్ ఉంటేనే రాష్ట్రానికి అనుమతిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు పోలీసులు.
పౌరులంతా స్వచ్ఛందంగా ఆంక్షలు పాటించేలా దిల్లీ పోలీసులు 'కరోనా రక్షక్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రోత్సహిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించినవారికి గులాబీలు ఇస్తున్నారు.
కేరళలో లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. రహదారిపై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేసి పంపిస్తున్నారు.
లాక్‌డౌన్‌తో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రహదారులు బోసిపోయాయి. బయటకు వస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెడుతున్నారు.
కర్ణాటకలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది.
ఇదీ చదవండి: దిల్లీలో మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు