ETV Bharat / bharat

కానిస్టేబుల్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఏడెళ్ల కుమార్తెపైనా... - కశ్మీర్​ వార్తలు

constable death: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. అతని ఏడేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Police constable shot dead in Srinagar
కానిస్టేబుల్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
author img

By

Published : May 24, 2022, 6:45 PM IST

Constable shot dead: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ల కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్ గాయమైన అతని కుమార్తెకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన కానిస్టేబుల్​ను సౌరాలోని మాలిక్ సాహిబ్ ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్లు చెప్పారు. కూతుర్ని ట్యూషన్​ నుంచి తీసుకెళ్లి ఇంటివద్ద డ్రాప్ చేస్తుండగా.. ఉగ్రవాదులు దాడి చేసినట్లు వివరించారు.

కానిస్టేబుల్​ కుమార్తె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఖాద్రి మృతితో కశ్మీర్​లో నెల వ్యవధిలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లయింది. వీరంతా ఉగ్రవాదుల దాడిలోనే మరణించారు. మే 7న ఐవా వంతెనపై ఓ పోలీస్​ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తర్వాత మే 13న పుల్వామాలో మరో పోలీస్​పై దాడి చేసి హత్య చేశారు.

ఇదీ చదవండి: ప్రపంచ రికార్డ్​.. 11కి.మీ పొడవైన వస్త్రం.. అమ్మవారికి సమర్పించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.