ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ను గత ప్రభుత్వాలు నాశనం చేశాయని దుయ్యబట్టారు ప్రధనమంత్రి నరేంద్ర మోదీ(modi news). మహోబాలో రూ.3,240కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వారు మాఫియా చేతుల్లో బుందేల్‌ఖండ్‌ను పెట్టి అభివృద్ధికి నోచుకోనివ్వలేదని ఆరోపించారు. నూతన ప్రాజెక్టులతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని రైతులకు సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు(pm modi latest news).
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రతి మూలలో అభివృద్ధి జరుగుతోందని మోదీ అన్నారు(pm modi speech today). ఒకప్పుడు యూపీలోని అటవీ ప్రాంతాన్ని, వనరులను ప్రభుత్వాలు మాఫియా చేతుల్లో పెట్టాయని, తాము వారిపై బుల్డోజర్ ప్రయోగించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఇది చూసి కొందరు ఓర్వేలేక పోతున్నారని ఎద్దేవా చేశారు(pm modi up visit).
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని ప్రారంభించిన అర్జున్ సహాయక్, రతౌలి వీర్, భవాని డ్యామ్, మఝ్‌గావ్-చిల్లి స్ప్రింక్లర్ ప్రాజెక్టులతో 65వేల హెక్టార్లకు సాగు నీరు అందనుంది. మహోబా, హమీర్పుర్, బండా, లాతిపుర్ జిల్లాల్లోని లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రాంతంలోని ప్రజలకు తాగునీటి సమస్య కూడా తీరనుంది.
ఈ కార్యక్రమంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సాగు చట్టాలు ఇప్పుడే రద్దైనట్టు కాదు.. ఇంకా చాలా ఉంది!'