ETV Bharat / bharat

'వినూత్న మార్గాల్లో 'ఆపరేషన్​ ఆక్సిజన్''

దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ లభ్యత, సరఫరాపై ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రులకు ఆక్సిజన్​ను సరఫరా చేయటంలో వినూత్న మార్గాలను అన్వేషించాలని సూచించారు.

PM Narendra Modi
ఆపరేషన్​ ఆక్సిజన్
author img

By

Published : Apr 22, 2021, 4:42 PM IST

Updated : Apr 22, 2021, 5:19 PM IST

ఆస్పత్రులకు ఆక్సిజన్ సహాయాన్ని అందించడంలో వినూత్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచేలా, పంపిణీని వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ లభ్యత, సరఫరాపై ఉన్నతాధికారులతో ప్రధాన మోదీ.. గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

PM Narendra Modi review
ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం

రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను మోదీ ఆదేశించారు. ఆక్సిజన్​ సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు స్థానిక అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలన్నీ ఆక్సిజన్​ను నిల్వ చేయకూడదని మోదీ స్పష్టం చేశారు.

"రాష్ట్రాల డిమాండ్​కు తగ్గట్టుగా ఆక్సిజన్​ సరఫరాను క్రమంగా మేం పెంచుతున్నాం. ప్రస్తుతం 20 రాష్ట్రాలకు 6,785 మెట్రిక్​ టన్నుల మెడికల్​ ఆక్సిజన్ అవసరం కాగా.. ఏప్రిల్​ 21 నుంచి ఈ రాష్ట్రాలకు 6,822 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ను సరఫరా చేస్తున్నాం. ప్రైవేటు, ప్రభుత్వ​ పరిశ్రమల సాయంతో రోజుకు 3,300 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తున్నాం. దూర ప్రాంతాలకు సరఫరా చేయటంలో రైల్వేశాఖ సాయాన్ని తీసుకుంటున్నాం."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

మోదీ సమీక్షా సమావేశానికి కేబినెట్​ కార్యదర్శి, పీఎం ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్​ అధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రులకు అందని ఆక్సిజన్- ఎంపీ ఫిర్యాదు

Last Updated : Apr 22, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.