PM Modis Youtube Channel: ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ కోటి సబ్‌స్క్రిప్షన్‌లను దాటింది. దీంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి నాయకుల్లో అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన రికార్డ్‌ను మోదీ నెలకొల్పారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు చెందిన యూట్యూబ్ ఛానల్ 36 లక్షల సబ్స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. ఇంకా ఎవరెవరి ఛానల్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి..
- మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్కు 30.7లక్షల సబ్స్క్రైబర్లు.
- ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొలకు 28.8 లక్షలు.
- యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌కు 7.03 లక్షలు.
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్‌కు 5.25 లక్షల సబ్‌స్క్రిప్షన్‌లు.
- శశి థరూర్ ఛానల్‌కు 4.39 లక్షల సబ్స్క్రైబర్లు.
- ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి 3.73 లక్షల సబ్స్క్రైబర్లు
- తమిళనాడు సీఎం స్టాలిన్ ఛానల్‌కు 2.12 లక్షలు
- శ్వేతసౌధం ఫాలోవర్స్‌లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 19 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: భాజపా వ్యూహాత్మక అడుగులు- మహారాజ్ జీ మాయ కొనసాగేనా?