ETV Bharat / bharat

వాయుసేన సింహగర్జన- హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు! - modi iaf airshow up purvanchal expressway

యూపీలో పూర్వాచల్ ఎక్స్​ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధానమంత్రి (PM Modi news) నరేంద్ర మోదీ.. ఎయిర్​షోను వీక్షించారు. మిరాజ్, సుఖోయ్ సహా పలు యుద్ధ విమానాలు రహదారిపై ల్యాండ్ అయ్యాయి.

MODI AIRSHOW up
pm modi news
author img

By

Published : Nov 16, 2021, 3:22 PM IST

Updated : Nov 16, 2021, 7:06 PM IST

వాయుసేన విన్యాసాలు

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​లో పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించిన అనంతరం అక్కడ నిర్వహించిన ఎయిర్​ షోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) వీక్షించారు. ఏఎన్‌-32 విమానం, ఫైటర్‌ జెట్‌లు సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000 వంటి యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని.. ఎక్స్​ప్రెస్ వేపై దిగాయి.

340.8 కిలోమీటర్ల పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే లఖ్‌నవూ-సుల్తాన్‌పూర్‌ హైవేలోని చాంద్‌సరాయ్‌ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బారాబంకి, అమేథీ, సుల్తాన్‌పూర్‌, ఫైజాబాద్‌, అంబేద్కర్‌ నగర్‌, ఆజంఘర్‌, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు గాజీపుర్‌ జిల్లాలోని హల్దారియా వద్ద ముగుస్తుంది.

ఈ హైవే మధ్యలో సుల్తాన్‌పూర్‌ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు మూడు కిలోమీటర్ల రన్‌వే ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రూ.22,500కోట్ల వ్యయంతో పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించింది.

ఇదీ చదవండి: 'వారిది మాఫియావాదం.. మాది అభివృద్ధి నినాదం'

Last Updated : Nov 16, 2021, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.