Parliament monsoon session 2022: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని.. సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. వచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిదని పేర్కొన్నారు.
సభ్యులందరూ ఉభయసభల్లో లోతైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ సమావేశాల్లోనే కొత్త రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికవుతారని.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్న మోదీ.. పార్లమెంట్‌లో చర్చలు, విమర్శలు అర్థవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: క్వింటాళ్ల కొద్దీ పేలుడు పదార్థాలు లభ్యం.. భారీ కుట్ర భగ్నం.. ఇద్దరు అరెస్ట్