ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News) నేడు ఉత్తర్ప్రదేశ్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ @75 న్యూ అర్బన్ ఇండియా కార్యక్రమాన్ని లఖ్నవూలో ప్రారంభించనున్నారు మోదీ. అక్టోబరు 5-7వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొననున్నాయి.
స్మార్ట్ సిటీస్ పథకం కింద 75 పట్టణ ప్రాంత ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధానమంత్రిత్వ కార్యాలయం పేర్కొంది.
లఖింపుర్(Lakhimpur Kheri News) ఘటన తర్వాత.. ప్రధాని మోదీ పర్యటిస్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి: 'లఖింపుర్ ఘటన'పై యోగి సర్కార్కు నిరసన సెగ