కరోనా కట్టడిలో భాగంగా.. దేశంలోని జిల్లాస్థాయి అధికారులతో ఈ నెల 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంకానున్నారు. వర్చువల్గా జరిగే ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది.
కరోనాపై పోరులో భాగంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధాని. ఇటీవలే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యారు. అనంతరం విడివిడగా వారికి ఫోన్లు చేసి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక రికవరీకి సవాళ్లు- ప్యాకేజీనే పరిష్కారం!