ETV Bharat / bharat

ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్​ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ - తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

PM Modi Speech at BC Atma Gourava Sabha in Hyderabad : తెలంగాణలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారని.. ఆ విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన.. ప్రజలంతా భారతీయ జనతా పార్టీపైనే విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్​ఎస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

PM Modi hyderabad tour
PM Modi Speech at BC Atma Gourava Sabha in HyderabadPM Modi Speech at BC Atma Gourava Sabha in Hyderabad
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 6:52 PM IST

Updated : Nov 7, 2023, 7:17 PM IST

ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్​ఎస్ ఓటమి ఖాయం ప్రధాని మోదీ

PM Modi Speech at BC Atma Gourava Sabha in Hyderabad : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామివారిని పీఎం స్మరించుకున్నారు. నా కుటుంబసభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించిన మోదీ.. 'మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను.. మీ ఆశీర్వాదంతోనే త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి సీఎం అవుతారు' అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీపైనే విశ్వాసంతో ఉన్నారన్న ఆయన.. అన్నివర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది : పవన్​ కల్యాణ్

తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారని సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి మోదీ ధ్వజమెత్తారు. ఆ విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్న మోదీ.. ఆ మూడింటి విషయంలో బీఆర్​ఎస్​ మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని.. స్వరాష్ట్రంలో బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్​ కాంగ్రెస్‌ సీ టీమ్ అని.. కాంగ్రెస్‌ బీఆర్​ఎస్ సీ టీమ్ అని ఆరోపించారు. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని చెప్పారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ లక్షణాలని ఆక్షేపించారు.

బీఆర్​ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీజేపీ ఛార్జ్​షీట్

బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తమ పార్టీనే అని తెలిపారు. అబ్దుల్‌ కలామ్‌, రామ్‌నాథ్‌ కోవింద్‌, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘటన భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. ఈ క్రమంలోనే ఓబీసీని అయిన తనను ప్రధానిని చేసింది, ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ అని చెప్పారు. బీసీ యువత కోసం బీఆర్​ఎస్ పార్టీ ఏమీ చేయట్లేదని.. వారికి రూ.లక్ష ఇస్తామని వాగ్దానం చేసి నెరవేర్చలేదని విమర్శించారు.

'వేలంపాట మాదిరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్​లు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు'

బీఆర్​ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని మోదీ మండిపడ్డారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం తథ్యమన్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్​ఎస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆరోపించారు. తెలంగాణ యువతను కేసీఆర్ సర్కారు మోసం చేసిందన్న మోదీ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ.. యువత జీవితాలను దుర్భరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను మోసం చేసిన బీఆర్​ఎస్​ను ఇంటికి పంపాలా.. వద్దా? అని ప్రశ్నించిన ప్రధాని.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అధికారంలోకి వస్తే పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తామని.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటైతే నేనేందుకు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తా : ఈటల

Last Updated : Nov 7, 2023, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.