భారత్- ఆస్ట్రేలియా (India-Australia Partnership) సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో చర్చించారు. దీనితోపాటు రానున్న క్వాడ్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ఇరు దేశాల అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
-
Was happy to speak with my friend @ScottMorrisonMP. We reviewed the rapid progress in the India-Australia Comprehensive Strategic Partnership, including through the recent 2+2 Dialogue. We also exchanged perspectives on regional developments and the forthcoming Quad meeting.
— Narendra Modi (@narendramodi) September 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Was happy to speak with my friend @ScottMorrisonMP. We reviewed the rapid progress in the India-Australia Comprehensive Strategic Partnership, including through the recent 2+2 Dialogue. We also exchanged perspectives on regional developments and the forthcoming Quad meeting.
— Narendra Modi (@narendramodi) September 15, 2021Was happy to speak with my friend @ScottMorrisonMP. We reviewed the rapid progress in the India-Australia Comprehensive Strategic Partnership, including through the recent 2+2 Dialogue. We also exchanged perspectives on regional developments and the forthcoming Quad meeting.
— Narendra Modi (@narendramodi) September 15, 2021
" రాబోతున్న క్వాడ్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో చర్చించాను. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా మాట్లాడాము."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఆస్ట్రేలియా మంత్రులైన మారిస్ పేస్, పీటర్ దట్టన్తో కలిసి టూ ప్లస్ టూ చర్చలు జరిపారు.
అఫ్గాన్‌లో తాజా పరిణామాలు, కొవిడ్ లాంటి అంశాలపై వాషింగ్టన్ వేదికగా జరగనున్న క్వాడ్ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకారాన్ని పెంచే మార్గాలపై కూడా మాట్లాడనున్నారు.
ఇదీ చూడండి: ఐరాస వేదికగా పాక్‌కు భారత్ చురకలు!