ETV Bharat / bharat

ఆ 'రెడ్ డైరీ' కాంగ్రెస్​ పార్టీని ఓడిస్తుంది.. పేపర్ లీక్​లో ప్రభుత్వం భాగస్వామి: మోదీ - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల

PM Modi Rajasthan Rally : రాజస్థాన్‌ రెడ్‌ డైరీ రహస్యాలు.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గద్దె దించుతాయని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం అవినీతి చిట్టా మొత్తం అందులో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్​లోని సికర్​లోని ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత నిధులను విడుదల చేశారు.

pm modi rajasthan rally
pm modi rajasthan rally
author img

By

Published : Jul 27, 2023, 1:35 PM IST

Updated : Jul 27, 2023, 3:27 PM IST

PM Modi Rajasthan Rally : ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల రాజస్థాన్‌లో కలకలం రేపిన 'రెడ్‌ డైరీ'లోని రహస్యాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని ఓడిస్తాయని అన్నారు. రెడ్​ డైరీ అనేది కాంగ్రెస్ 'దోపిడీ బజార్​'​ తాజా ఉత్పత్తి అని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. పరీక్షా పత్రాల లీక్​లో భాగస్వామిగా ఉందని ఆరోపించారు. యువత కలలు నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ మరోసారి ప్రతిపక్ష కూటమి 'ఇండియా'పై కూడా విమర్శలు చేశారు.

  • #WATCH | Prime Minister Narendra Modi speaks on 'Laal Diary'; says, "The Congress has only run 'Loot ki dukaan' and 'Jhooth ka bazaar' in Rajasthan in the name of running government...The latest product of this is the 'Laal Diary' of Rajasthan. It is said that in this diary… pic.twitter.com/w0acOjzVul

    — ANI (@ANI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర అనే నినాదం నడిచింది. ప్రస్తుతం యూపీఏ అంటే ఇండియా.. ఇండియా అంటే యూపీఏగా మారిపోయింది. రాజస్థాన్​లో ప్రస్తుతం 'కమలం గెలుస్తుంది, కమలం వికసిస్తుంది' అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇండియా పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదారి పట్టించలేవు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియా ఉంది. కానీ ఈ కంపెనీ ఉద్దేశం భారతదేశాన్ని దోచుకోవడమే. అలాగే ఉగ్ర సంస్థ సిమి పేరులో కూడా ఇండియా ఉంది.'

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

  • #WATCH | PM Narendra Modi says, "With the label of INDIA, they want to cover up their old deeds, the deeds of UPA. Had they really cared about India, would they have asked foreigners to interfere in India?...They had once given the slogan 'Indira is India, India is Indira.' At… pic.twitter.com/2sEPfAUyYV

రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం..
PM Modi Farmers : దేశంలోని రైతులకు రూ.266కే యూరియా బస్తా అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదే యూరియా బస్తా ధర పాకిస్థాన్‌లో రూ.800, బంగ్లాదేశ్‌లో రూ.720, చైనాలో రూ.2,100 ఉందని తెలిపారు. యూరియా ధర కారణంగా రైతులు నష్టపోవడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్​ అనుమతించదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్​లోని సికర్​లోని ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్షా 25 వేల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను దేశానికి అంకితం చేశారు. ఈ కేంద్రాలను వన్​స్టాప్ కేంద్రాలుగా అభివర్ణించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత నిధులను విడుదల చేశారు.

'గత తొమ్మిదేళ్లుగా రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. నగరాల్లో లభించే ప్రతి సౌకర్యాన్ని గ్రామాలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు కష్టపడి.. మట్టిలోనుంచి బంగారాన్ని వెలికి తీస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. మా ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకుంటుంది.'

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ అనారోగ్యం కారణంగా సికర్​లో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేదని ప్రధాని మోదీ అన్నారు. గహ్లోత్​ గత కొన్నాళ్లుగా కాలి గాయంతో బాధపడుతున్నారని.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాజస్థాన్​లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు.. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మోదీ అన్నారు.

  • #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi says, "Today the country's farmers have received Rs 18,000 crores under the PM Kisan Samriddhi. Today, 1,25,000 PM Kisan Samriddhi Kendras (PMKSKs) centres have started in the country. The PMKSYs centres at the block & village… pic.twitter.com/o0gZhhxdDV

  • #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi says, "...The power of the farmers and the hard work of the farmers extract gold from the soil. That's why our government is standing shoulder to shoulder with the farmers of the country. Today, after so many decades since… pic.twitter.com/0qhEnep71f

ఆ డైరీలో ఏముందో తెలుసుకోలేరా?
Ashok Gehlot PM Modi : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. 'ప్రధాని పదవిపై గౌరవం ఉంది. ఐటీ, ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నారు. మరి రాజస్థాన్ రెడ్​ డైరీలోని విషయాలను కనుక్కొలేరా?. ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో నేను పాల్గొని మాట్లాడవలసి ఉంది. కానీ బుధవారం రాత్రి అకస్మాత్తుగా నా ప్రసంగాన్ని షెడ్యూల్ నుంచి తప్పించారు. ఈ ధోరణి సరైనది కాదు.' అని గహ్లోత్ మండిపడ్డారు.

  • #WATCH | Rajasthan CM Ashok Gehlot says, "...I was scheduled to speak at the PM's event. But suddenly last night I was told that my speech has been omitted...This tendency is not right...I have no objection with the PM arriving in the state but if you drop the CM's speech after… https://t.co/4jFFHmgNgk pic.twitter.com/M5wsH4uUZn

  • #WATCH | Rajasthan CM Ashok Gehlot says, "I heard that PM gave a speech in Sikar on 'Laal Diary'. The position of PM holds dignity. IT, ED and CBI are being misused across the country. Can't they gather information from on the 'Diary' from them?...Are they so perturbed? Rajasthan… pic.twitter.com/douyml0Eiu

మోదీ పర్యటనకు గహ్లోత్ డుమ్మా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజస్థాన్‌ పర్యటనకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ గైర్హాజరయ్యారు. తమ రాష్ట్రానికి వచ్చే ప్రధానిని తాను కేవలం ట్విట్టర్ ద్వారానే ఆహ్వానించగలనని గహ్లోత్ అన్నారు. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని రద్దు చేయడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని గహ్లోత్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు.

'ఈ రోజు మీరు రాజస్థాన్‌కు వస్తున్నారు. కానీ, ప్రధాని కార్యాలయం నా మూడు నిమిషాల ప్రసంగాన్ని షెడ్యూల్‌ నుంచి తొలగించింది. అందువల్ల, నేను నా ప్రసంగంతో మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నా. అందుకే ట్విట్టర్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా. నేను నా ప్రసంగంలో చెప్పాలనుకున్న డిమాండ్లను కూడా ట్విట్టర్ ద్వారానే మీ ముందుంచుతున్నా. గత 6 నెలల్లో ఏడోసారి రాజస్థాన్ రాష్ట్ర పర్యటనకు వస్తున్న మీరు ఈ సారైనా మా డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తున్నా' అని గహ్లోత్‌ ట్వీట్ చేశారు.

  • माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी,
    आज आप राजस्थान पधार रहे हैं। आपके कार्यालय PMO ने मेरा पूर्व निर्धारित 3 मिनट का संबोधन कार्यक्रम से हटा दिया है इसलिए मैं आपका भाषण के माध्यम से स्वागत नहीं कर सकूंगा अतः मैं इस ट्वीट के माध्यम से आपका राजस्थान में तहेदिल से स्वागत करता…

    — Ashok Gehlot (@ashokgehlot51) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పీఎంఓ స్పందన..
అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేసిన ట్వీట్​కు ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించింది. 'ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాం. మీ ప్రసంగానికి సమయాన్ని కూడా కేటాయించాం. కానీ, మీరు ఈ కార్యక్రమానికి రాలేరని సీఎంఓ నుంచి సమాచారం వచ్చింది. సికర్​లో జరుతుతున్న కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అభివృద్ధి పనుల శిలాఫలకాలపైనా మీ పేరును ఉంచాం' అని పీఎంఓ ట్వీట్ చేసింది.

  • श्री @ashokgehlot51 जी,

    प्रोटोकॉल के अनुसार आपको विधिवत आमंत्रित किया गया था और आपका भाषण भी रखा गया था। लेकिन आपके ऑफिस ने बताया कि आप शामिल नहीं हो पाएंगे।

    प्रधानमंत्री @narendramodi की पिछली यात्राओं के दौरान भी आपको हमेशा आमंत्रित किया गया है और आपकी गरिमामयी उपस्थिति भी… pic.twitter.com/6MxBLmwcWq

    — PMO India (@PMOIndia) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 27, 2023, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.