ETV Bharat / bharat

భగత్​ సింగ్​కు ప్రధాని మోదీ నివాళి

భగత్​ సింగ్​, సుఖ్​దేవ్​, రాజ్​గురు వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. సామాజిక కార్యకర్త డా. రామ్​ మనోహర్​ లోహియా జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మోదీ.. ప్రగతి శీల ఆలోచనలతో లోహియా దేశాన్ని కొత్త మార్గంలో నడిపించేందుకు కృషి చేశారని కొనియాడారు.

bhagat
భగత్​ సింగ్​కు ప్రధాని మోదీ నివాళి
author img

By

Published : Mar 23, 2021, 10:40 AM IST

షహీద్​ దివస్​ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య సమరయోధులైన భగత్​ సింగ్​, సుఖ్​దేవ్​, రాజ్​గురు త్రయానికి నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని మంగళవారం ట్వీట్​ చేశారు.

"స్వాతంత్ర్య విప్లవకారులైన భగత్​ సింగ్, సుఖ్​దేవ్, రాజ్​గురు వర్ధంతి సందర్భంగా వారికి నా వందనాలు. భరతమాత కుమారులైన వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయి. జై హింద్."

-నరేంద్ర మోదీ, ప్రధాని

లోహియాకు నివాళులు..

స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్త అయిన డా.రామ్​ మనోహర్​ లోహియా జయంతి సందర్భంగా ప్రధాని నివాళులు అర్పించారు. ప్రగతి శీల ఆలోచనలతో దేశాన్ని కొత్త మార్గంలో నడిపించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన కృషి భారతీయులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

ఇదీ చదవండి : సింధు జల వివాదాలపై నేడు భారత్​-పాక్​ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.