సాయుధ బలగాల పతాక నిధికి తోడ్పడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫ్లాగ్ డే సందర్భంగా సైన్యం, వాయుసేన, నౌకాదళాల పోరాట పటిమను ప్రధాని మోదీ కీర్తించారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు మోదీ.

"సాయుధ దళాల పతాక దినోత్సవం... సాయుధ బలగాలు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన రోజు. సైనికుల విరోచిత, నిస్వార్థ త్యాగాలకు భారత్ గర్విస్తుంది. సైనిక బలగాల సంక్షేమం కోసం తోడ్పడండి. ఇది ఎంతో మందిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది."
- ప్రధాని నరేంద్ర మోదీ


దేశ రక్షణ విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడ్డవారికి ప్రజలు అండగా ఉన్నారనే భరోసా కల్పించడానికి ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటాం. వివిధ పోరాటాల్లో గాయపడిన సైనికులు, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ బలగాల పతాక నిధిని వినియోగిస్తారు.
ఇదీ చూడండి: ఆగ్రా మెట్రో ప్రాజెక్టు పనులకు మోదీ శ్రీకారం