PM Modi on Congress: స్వాతంత్య్రానంతరం దేశంలో స్మారక కట్టడాలను దిల్లీలోని కొన్ని కుటుంబాల కోసమే నిర్మించారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. జాతీయ గౌరవాన్ని ఇనుమడించేలా నిర్మిస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లోని సోమనాథ ఆలయం సమీపంలో కొత్తగా నిర్మించిన సర్క్యూట్ హౌస్‌ను దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
"మన పూర్వీకులు చాలా విషయాలు మనకు ఇచ్చివెళ్లారు. సుసంపన్నమైన మన సంస్కృతి ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైంది."
-ప్రధాని నరేంద్ర మోదీ
దేశంలో వారసత్వ కట్టడాలు ఆర్థిక ప్రగతికి కారణమౌతాయని మోదీ చెప్పారు. పర్యటకం అభివృద్ధి చెందడానికి 'పరిశుభ్రత, సౌకర్యాలు, పర్యటకులకు గౌరవం, ఆధునికత' అవసరమని అన్నారు.
అభివృద్ధికి సువర్ణకాలం:
మరోవైపు.. మణిపుర్ పురోగతికి ఆటంకాలు తొలగిపోయాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని చెప్పారు. 70 ఏళ్లుగా మణిపుర్ అభివృద్ధికి ఆటంకం కలిగించిన శక్తులను మళ్లీ తలదూర్చేందుకు అనుమతించవద్దని ప్రధాని శుక్రవారం చెప్పారు.
మణిపుర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న 25 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధికి 'బంగారు కాలం'గా అభివర్ణించారు. సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుసంపన్నంగా తయారవుతుందని పేర్కొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఆరనున్న అమర జవాను జ్యోతి.. మండిపడ్డ కాంగ్రెస్