ETV Bharat / bharat

మహిళా దినోత్సవం వేళ మోదీ కొన్న వస్తువులు ఇవే.. - Classic Palm Craft Nilavilakku

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలు తయారు చేసిన వస్తువులను కొన్నింటిని కొనుగోలు చేశారు. మహిళల సృజనాత్మకతను చాటి చెప్పేలా వాటిని ట్విట్టర్​లో​ పంచుకున్నారు.

PM Modi buys products to celebrate women enterprise, creativity on International Women's Day
మహిళా దినోత్సవాన్ని చాటుతూ మోదీ కొన్న ఉత్పత్తులు
author img

By

Published : Mar 8, 2021, 7:57 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళల చేతుల్లో నడుస్తున్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మహిళల సృజనాత్మకత భారత సంస్కృతిని పెంపొందిస్తుందన్న మోదీ.. 'ఆత్మ నిర్భర్​' భారత్​లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు.

PM Modi buys products to celebrate women enterprise, creativity on International Women's Day
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

ఈ మేరకు తాను కొనుగోలు చేసిన వస్తువులను ట్విట్టర్​లో పంచుకున్నారు మోదీ. దీనికి 'నారీ శక్తి' అనే హ్యాష్​ ట్యాగ్​ను జోడించారు.

ఎంబ్రాయిడరీ శాలువా..

తమిళనాడులోని తోడా తెగకు చెందిన చేనేత కార్మికులు నేసిన ఎంబ్రాయిడరీ శాలువా అద్భుతంగా ఉందని చెప్పారు ప్రధాని. ఈ ఉత్పత్తులను ట్రైబ్స్​ ఇండియా మార్కెట్​ విక్రయిస్తోందని ఆయన పేర్కొన్నారు.

పేపర్​ పెయింటింగ్​..

గోండ్​ పేపర్​ పెయింటింగ్​

గిరిజన ప్రాంతాల వారు హస్తకళతో చేసిన పేపర్ పెయింటింగ్​ను కొన్నట్టు కూడా మోదీ చెప్పారు. దీన్నే గోండ్​ పెయింటింగ్​ అంటారని.. ఇది వారి అద్భుతమైన సృజనాత్మకతకు నిదర్శనమని కొనియాడారు.

నాగ శాలువా..

నాగ శాలువా

సంప్రదాయ నాగ శాలువాను కొనుగోలు చేసినట్టు ట్వీట్​ చేశారు మోదీ. ఇది ధైర్యం, కరుణ, సృజనాత్మకతలకు ప్రతీకగా నిలవడం సహా.. దేశానికి గర్వకారణం అని చెప్పారు.

ఖాదీ కాటన్ మధుబని స్టోల్​..

ఖాదీ కాటన్​ మధుబని స్టోల్​

మహాత్మాగాంధీతో పాటు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం 'ఖాదీ'కి ఉందన్న మోదీ.. ఖాదీ కాటన్​ మధుబని పెయింటెడ్​ స్టోల్​ను కొన్నట్టు తెలిపారు. ఇది అత్యుత్తమ నాణ్యత కలిగి ఉందన్న ఆయన.. దేశ పౌరుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమన్నారు.

ఫైల్​ ఫోల్డర్​..

ఫైల్​ ఫోల్డర్​

దస్తావేజులు, పత్రాలు వంటివి భద్రపరచుకునేందుకు.. బంగాల్​ వాసుల చేతితో తయారు చేసిన జనపనారతో కూడిన ఫైల్​ ఫోల్డర్​ను​ వాడనున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిఒక్కరూ బంగాల్​ జనుము వస్తువును కలిగి ఉండాలని ఆయన సూచించారు. అక్కడి గిరిజనులు వీటిని తయారు చేస్తారు.

గమూసా..

గమూస

ఇక.. తాను అధికంగా ధరించే గమూస(శాలువా)ను ప్రజలు చూస్తుంటారన్న మోదీ.. వీటిని కాకతిపపుంగ్​ డెవలప్​మెంట్​​ బ్లాక్​లోని సహాయక బృందం తయారు చేస్తుందని వివరించారు. చాలా సౌకర్యంగా ఉండే దీనిని తాను కొనుగోలు చేసినట్టు తెలిపారు.

క్లాసిక్​ పామ్ క్రాఫ్ట్​ నీలవిలక్కు..

నీలవిలక్కు

కేరళ మహిళలు రూపొందించిన క్లాసిక్​ పామ్​ క్రాఫ్ట్​ నీలవిలక్కు(ప్రతిమ)ను తీసుకున్నట్టు మోదీ చెప్పారు. దీన్ని వినియోగించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి నారీ శక్తి హస్తకళా నైపుణ్యాన్ని ప్రశంసించారు.

ఇదీ చదవండి: మహిళల విజయాలతో భారత్​ గర్విస్తోంది: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.